Jailer : జైలర్ సినిమాకు ఊహించని షాక్.. కలెక్షన్లపై పడనున్న ఎఫెక్ట్..!
ఒక్కే ఒక్క సినిమాతో తన స్టామినా ఏ పాటిదో చూపించాడు రజినీకాంత్ (Rajinikanth). జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.
- Thota Vamshi Kumar
- Published On : August 30, 2023 / 03:31 PM IST
Jailer HD print leaked
Jailer HD print leaked : గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో చాలా మంది సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) పనైపోయిందని అన్నారు. అయితే.. అక్కడ ఉంది ఎవరు..? తలైవా.. అంత త్వరగా ఓటమిని ఒప్పుకునే రకం కాదు. ఒక్కే ఒక్క సినిమాతో తన స్టామినా ఏ పాటిదో చూపించాడు. జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.550 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రూ.600 కోట్ల దిశగా పయనిస్తోంది.
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ కూడా థియేటర్ల వద్ద స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని ఓ వైపు వార్తలు వస్తుండగా, ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్ లీకైంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు సినిమాలోని కొన్ని సన్నివేశాలను స్ర్కీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కాగా.. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని, పైరసీ లింక్స్ షేర్ చేయొద్దని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో జైలర్ సినిమా హెడ్‌డీ ప్రింట్ లీక్ కావడంతో దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో సన్‌నెక్ట్స్ వీలైనంత త్వరగా సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
రజినీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించగా తమన్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా సన్ పిక్చర్స్ సంస్థ రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. కాగా.. ఈ చిత్రానికి సీక్వెల్ ఉండనుందని దర్శకుడు చెప్పాడంటూ వార్తలు వస్తున్నాయి.
Sagileti Katha : ‘సగిలేటి కథ’ మూవీ నుంచి ‘అట్టా ఎట్టాగా’ లిరికల్ సాంగ్ రిలీజ్.. బ్యూటిఫుల్ మెలోడీ!
Jailer HD print leaked
