Monalisa: కుంభమేళా మోనాలిసా పెళ్లిపై బిగ్ ట్విస్ట్.. ఇది లవ్ జిహాద్ అంటూ తండ్రి సంచలన కామెంట్స్

కూతురు మోనాలిసా పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసిన జైసింగ్ భోంస్లే.

Jaisingh Bhosale sensational comments on daughter Monalisa marriage.

  • నా కూతురిది లవ్ జీహాదీ
  • దయచేసి తనను ఇంటికి తీసుకురండి
  • ముఖ్రమంత్రిని వేడుకున్న మోనాలిసా తండ్రి

Monalisa: ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మోనాలిసా భోంస్లే వివాహం ఇప్పుడు వివాదానికి దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కు చెందిన ఈ 18 ఏళ్ల యువతి, కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. కేరళలోని ఒక ఆలయంలో జరిగిన ఈ వేడుకకు స్థానిక మంత్రులు కూడా హాజరు కావడం విశేషం.

Jeevitha Rajasekhar: రాజశేఖర్‌కు గోటీల ఫ్యాక్టరీ ఉందా.. వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన జీవిత

అయితే, ఈ పెళ్లిపై మోనాలిసా(Monalisa) తండ్రి జైసింగ్ భోంస్లే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన కుమార్తె “లవ్ జిహాద్”కు బాధితురాలిగా మారిందని, సదరు యువకుడు ఆమెను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తన కుమార్తెను సురక్షితంగా మధ్యప్రదేశ్‌కు తీసుకురావాలని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను వేడుకున్నారు జైసింగ్ భోంస్లే. తన కూతురు మోనాలిసా సినీ రంగంలో రాణించాలని కలలు కనేదని, ఈ వివాహం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన కన్నీరు పెట్టుకున్నాడు.

మరోవైపు, హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు కూడా మోనాలీసాను తిరిగి ఇంటికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమది లవ్ జిహాద్ కాదని, ఇష్టపూర్వకమే పెళ్లి చేసుకున్నామని వారు స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు తనకు ఇష్టం లేకుండా మేనత్త కొడుకుతో పెళ్లి చేయాలని ఒత్తిడి చేయడం వల్లే, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని మోనాలిసా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారింది.