Janhvi Kapoor : అతనితో జాన్వీ కపూర్ ప్రేమ నిజమే..? ఆ సమయంలో నా పక్కనే ఉన్నాడు.. తాజా కామెంట్స్ వైరల్..

శిఖర్ పహారియా గురించి ఇంట్రస్టింగ్‌ విషయాలు షేర్‌ చేశారు జాన్వీ కపూర్. (Janhvi Kapoor)

  • Published on- October 29, 2026 / 11:38 AM IST

Janhvi Kapoor

Janhvi Kapoor : సోషల్‌ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతుంది బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్. దేవర, పెద్ది సినిమాలతో సౌత్‌ ఆడియెన్స్‌ని అలరించిన జాన్వీ ప్రేమ గురించి మరోసారి చర్చ జరుగుతోంది. శిఖర్‌ పహారియాతో జాన్వీ కపూర్‌ రిలేషన్‌షిప్‌ మీద సోషల్‌ మీడియాలో గత కొన్నాళ్ల నుంచి చాలా రకాల రూమర్స్‌ వైరలవుతున్నాయి. గతంలో జాన్వీ ఎక్కడ ఉంటే అక్కడే శిఖర్‌ పహారియా కూడా కనిపించేవాడు. దీంతో శిఖర్‌-జాన్వీ ఈ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే ప్రచారం సైతం జరిగింది.

అయితే ఈ వార్తలని ఇప్పటివరకూ ఏ మాత్రం ఖండించని జాన్వీ కపూర్‌ మరింతగా బూస్ట్‌ ఇచ్చేలా హింట్స్‌ ఇస్తుంది. కాఫీ విత్ కరణ్ సీజన్ 9 లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో శిఖర్ పహారియా గురించి ఇంట్రస్టింగ్‌ విషయాలు షేర్‌ చేశారు జాన్వీ కపూర్.

Also Read : Rajinikanth : రజినీకాంత్ తో తమిళ తంబీల కోరిక నెరవేరుతుందా..? అందని ద్రాక్ష అందుతుందా..?

తన తల్లి శ్రీదేవి చనిపోయినప్పుడు శిఖర్ ఎంతో సపోర్ట్‌గా నిలిచారన్నారు. ఆ సమయంలో లండన్‌లో చదువుతున్న శిఖర్‌ తన సెమిస్టర్‌ని మధ్యలోనే వదిలి ముంబైకి వచ్చాడని చెప్తూ తనకు ఏ మాత్రం అవసరం వచ్చినా అందుబాటులో ఉండేందుకు జుహులో దాదాపు నెల రోజులు నా పక్కనే ఉన్నాడని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది జాన్వీ.

జాన్వీ కపూర్‌, శిఖర్ పహారియా రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దీనిని ఈ ఇద్దరు బహిరంగంగా ప్రకటించకపోయినా.. కొన్ని ఇంటర్వ్యూల్లో శిఖర్ గురించి జాన్వీ ఓపెన్‌ గానే చెబుతుంది. కాఫీ విత్ కరణ్ షోలో మాత్రమే కాకుండా రీసెంట్‌గా రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జాన్వీ ప్రేమపై కామెంట్స్ చేస్తూ.. ప్రేమ అనేది ఎంతో సురక్షితమైన భావన. నా నిస్సహాయతను దూరం చేసింది శిఖర్ ప్రేమేనని, అక్కడ తనని ఎవరూ జడ్జ్ చేయరనే స్వేచ్ఛ ఉందని, తన కలలనే అతని కలలుగా భావిస్తాడని తెలిపింది. దీంతో శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నాను అని ఇండైరెక్ట్ గానే చెప్తుంది ఈ భామ.

Also See : Shravani Reddy : రుద్రవనం PS సిరీస్ ఈవెంట్.. చీరకట్టులో శ్రావణి రెడ్డి..

శిఖర్ పహారియా మహారాష్ట్రలో ఒక బిజినెస్ మెన్. మాజీ కేంద్ర హోం మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ షిండే మనవడే శిఖర్ పహారియా.