Janhvi Kapoor spilled out his boy friend name in koffee with karan show
Janhvi Kapoor : బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య ఎక్కడ కనిపించినా.. ఈ ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారా..? అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ ఈ ఇద్దరు మాత్రం.. ఈ విషయం నోరు విప్పడం లేదు. తాజాగా జాన్వీ ఈ విషయంలో నోరు జారినట్లు కనిపిస్తుంది.
జాన్వీ కపూర్ తన చెల్లెలు ఖుషీ కపూర్ తో కలిసి రీసెంట్ గా బాలీవుడ్ టాప్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొంది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో జాన్వీని కరణ్ జోహర్.. ”నీ స్పీడ్ డయల్ లిస్టులో ఉన్న ముగ్గురి పేర్లు చెప్పు..?” అంటూ ప్రశ్నించారు. దానికి జాన్వీ బదులిస్తూ.. ”పప్పా, ఖుషూ, షికూ” అని చెప్పారు. మొదటి రెండు పేర్లు ఆమె తండ్రి, చెల్లెలకు సంబంధించినవి.
Also read : Mahesh Babu : ఖలేజా మూవీ సీన్‌ని.. నమ్రతతో రీ క్రియేట్ చేసిన మహేష్.. ఫోటో వైరల్..
ఇక మూడో రేపు శిఖర్ పహారియాది అని తెలుస్తుంది. శిఖర్ పేరుని షికూ అని సేవ్ చేసుకున్నట్లు అర్ధమవుతుంది. కాగా ఈ పేరు చెప్పినప్పుడు జాన్వీ కూడా.. అర్రే నోరు జారాను అన్నట్లు బిహేవ్ చేశారు. కరణ్ జోహార్ ఆ సమాధానం రాగానే నవ్వుతూ ఎగిరి గంతులేసేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ ఎపిసోడ్ పై కొంచెం క్యూరియాసిటీ కూడా క్రియేట్ అయ్యింది. మరి వీరిద్దరి ప్రేమ కథ ఇప్పుడైనా బయటపడుతుందేమో చూడాలి.
కాగా జాన్వీ నటిస్తున్న దేవర విషయానికి వస్తే.. నేడు ఈ మూవీ గ్లింప్స్ గురించిన అప్డేట్ ని ఇచ్చారు. జనవరి 8న మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కొరటాల శివ డైరెక్షన్ లో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి పార్ట్ ని 5 ఏప్రిల్ 2024లో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనపడబోతున్నారు.