Shah Rukh Khan : బాలీవుడ్ ఇతర హీరోల దగ్గర లేనివి తన దగ్గర ఉన్నవి అవే అంటున్న షారుఖ్.. ట్వీట్ వైరల్!
షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాలో #AskSRK అంటూ ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇంటరాక్షన్ లో షారుఖ్ చేసిన ఒక ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
- gum 95921
- Published On : June 13, 2023 / 04:42 PM IST
Jawan star Shah Rukh Khan viral tweet on bollywood other star heros
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ (Pathaan) సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆ చిత్రం కమ్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని ఇండస్ట్రీ హిట్టు అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా జోష్ ని నింపాడు. ఇక పఠాన్ సినిమా సమయం నుంచి షారుఖ్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే #AskSRK అంటూ ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తున్నాడు. తాజాగా షారుఖ్ ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అవ్వగా పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఒక నెటిజెన్ షారుఖ్ ని.. ‘ఇతర హీరోల దగ్గర లేనివి, మీ దగ్గర ఉన్నవి ఎంటివి’ అని కాంట్రావర్సీ ప్రశ్న వేశాడు. దీనికి బాద్ షా బదులిస్తూ.. “నా దగ్గర దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, దేవదాస్, స్వదేశ్, చక్ దే ఇండియా, ఓం శాంతి ఓం, పఠాన్.. చిత్రాలు ఉన్నాయి” అంటూ చెప్పుకొస్తూ ఇలాంటి ప్రశ్నలు అడగడం ఇక ఆపండి అంటూ ఆ నెటిజెన్ కి కౌంటర్ ఇచ్చాడు. కాగా షారుఖ్ చెప్పిన సినిమాలు అన్ని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టులు మాత్రమే కాదు. బాలీవుడ్ లో కూడా ఇండస్ట్రీ హిట్టులుగా, బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాలు.
Adipurush : తెలుగు తెర పై శ్రీరాముడిగా కనిపించిన నటులు.. వెండితెరపై మొదటి రాముడు ఎవరో తెలుసా?
ఇక మరో అభిమాని.. ‘ప్రస్తుతం మీరు చేస్తున్న డంకీ, జవాన్ (Jawan) చిత్రాల్లో ఏది మీకు ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అని ప్రశ్నించాడు. దానికి షారుఖ్.. జవాన్ అంటూ బదులిచ్చాడు. అందులో యాక్షన్ సీన్స్ చేయడం తనకి చాలా కష్టమనిపించిందట. అలాగే జవాన్ సినిమాలో విలన్ గా చేస్తున్న విజయ్ సేతుపతి గురించి మాట్లాడుతూ.. సేతుపతి ఒక అద్భుతమైన నటుడని, తనకి తాను పెద్ద అభిమానాన్ని అని చెప్పుకొచ్చాడు. కాగా జవాన్ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.
Mere paas DDLJ hai….KKHH hai, Devdas hai Swades hai Chak se India hai…Pathan hai…Om Shanti Om hai….ohh need to stop showing off!! Ha ha https://t.co/FE7JRfjHJB
— Shah Rukh Khan (@iamsrk) June 12, 2023
