Jayaho Ramanuja : ‘జయహో రామానుజ’ రిలీజ్ డేట్ అనౌన్స్..
జయహో రామానుజ సినిమా వరల్డ్ వైడ్ అక్టోబర్ 24న థియేట్రికల్ రిలీజ్ కానుంది. (Jayaho Ramanuja)
- Saketh U
- Published on- October 15, 2026 / 05:34 PM IST
Jayaho Ramanuja
Jayaho Ramanuja : లయన్ డా.సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. జో శర్మ, సుమన్, ప్రవళ్లిక.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసి, రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జయహో రామానుజ సినిమా వరల్డ్ వైడ్ అక్టోబర్ 24న థియేట్రికల్ రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రెస్ మీట్ లో నటుడు, డైరెక్టర్ లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో పాతికేళ్ల ప్రయాణం నాది. మా మొదటి సినిమా హీరో సుమన్. ఆయన ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యుల జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాను డబ్బుల కోసం తీయలేదు. రామానుజాచార్యుల వారి గొప్ప కథను ఈ తరం వారికి చూపించాలని తీసాము అని తెలిపారు.
Also Read : Anupama Parameswaran : అనుపమ 2.0 అంటూ.. బ్రేకప్ తర్వాత మొదటి సారి పెళ్లిపై స్పందించిన అనుపమ..
నటి, నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ.. ఈ సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా నిర్మిస్తూనే కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించాను. ఈ తరం ప్రేక్షకులకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియాలి అని అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ.. చాలా కష్టంతో కూడుకున్న మూవీ ఇది. సాయి వెంకట్ చాలా కన్విక్షన్ తో ఈ సినిమాను తీశారు. మంచి క్యారెక్టర్ చేశాను. మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. అయినా మనమంతా కలిసే ఉంటున్నాం. ఈ భావనకు మొదట కృషి చేసింది రామానుజాచార్యుల వారు అని తెలిపారు.
