JD Chakravarthy: ప్రమోషన్స్ లో అసభ్యతా.. స్టేజిపై బూతు పాట.. టాలీవుడ్ ఫై జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్
సినిమా ప్రమోషన్స్ లో అసభ్యత ఎక్కువయ్యింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు జేడీ చక్రవర్తి(JD Chakravarthy).
- V Santhosh Kumar
- Published On : February 4, 2026 / 07:01 PM IST
JD Chakravarthy shocking about movie promotions.
- సినిమా ప్రమోషన్స్ లో అసభ్యత
- బూతు మాటలు, పాటల వల్ల సినిమాలు ఆడవు’
- షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు జేడీ చక్రవర్తి
JD Chakravarthy: సినిమాల ప్రమోషన్స్ విషయంలో అసభ్యకరమైన కంటెంట్ పెరుగుతుంది అంటూ సంచనల కామెంట్స్ చేశాడు నటుడు జేడీ చక్రవర్తి. ఆయన ఇటీవల వెళ్లిన ఒక మూవీ ఈవెంట్ లో పడిన పాట వినగానే అక్కడినుంచి వెళ్లిపోవాలని అనిపించింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు జేడీ చక్రవర్తి చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
అసలు విషయం ఏంటంటే, ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘బరాబర్ ప్రేమిస్తా’. దర్శకుడు సంపత్ రుద్రా తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలో మేఘన ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా బరాబర్ ప్రేమిస్తా మూవీ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి జేడీ చక్రవర్తి(JD Chakravarthy) గెస్ట్ గా హాజరయ్యారు.
Roshan Meka: కన్నప్ప బ్యూటీపై కన్నేసిన రోషన్.. శైలేష్ సినిమా కోసం సరికొత్తగా
ఆ సమయంలో చంద్రహాస్ స్టేజిపై బూతుపదాలతో ఒక పాటను పాడాడు. ఆ సమయంలో జేడీ చక్రవర్తి చాలా అభ్యంతరంగా ఫీలయ్యాడట. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా ప్రమోషన్స్ కోసం క్రియేటీవ్ గా ఆలోచించాలి. అది ప్రేక్షకుల వరకు చేరేలా ఉండాలి. దానికి, అసభ్యకరమైన మార్గాలు అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ అంటే గ్లామర్ షో, బూతు పాటలు కాదు. నిజంగా ఆ ఈవెంట్ లో బూతు పాట పాడటం చూసి నేను షాక్ అయ్యాను.
ఇలాంటి ప్రమోషన్స్ వల్ల సినిమాలు ఆడవు. 3 ఇడియట్స్ సినిమా ప్రమోషన్స్ కోసం అమీర్ ఖాన్ లాంటి హీరో ఇన్నోవేటివ్ స్టంట్లు చేశాడు. అందులో, ఎక్కడ అసభ్యత లేదు. కానీ, ఈమధ్య టాలీవుడ్ సినిమా ప్రమోషన్లలో అసభ్యతా ఎక్కువ అయింది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో, జేడీ చక్రవర్తి చేసిన ఈ కామెంట్స్ ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
