MAA Elections 2021 : ‘మా’ మధ్య విబేధాలు లేవు..
‘మా’ ఎన్నికల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్, సీనియర్ నటి జీవిత రాజశేఖర్ ఇద్దరు జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడుతున్నారు..
- sekhar
- Published on- September 5, 2021 / 04:52 PM IST
Jeevitha Rajasekhar
MAA Elections 2021: ‘మా’ లో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ఎన్నో కీలక మలుపులు తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం బండ్ల గణేష్ నిర్ణయంతో మరింత సంచలనంగా మారింది. వచ్చే ‘మా’ ఎన్నికల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్, సీనియర్ నటి జీవిత రాజశేఖర్ ఇద్దరు జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడుతున్నారు.
Sonu Sood : బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సోనూ సూద్..
తాను జనరల్ సెక్రెటరీ పదవికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని ట్వీట్ చేసిన బండ్ల.. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో జనరల్ సెక్రెటరీకి పోటీలో నిలుచున్న జీవిత రాజశేఖర్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాను అభిమానించిన వాళ్ళను తిట్టిన జీవితకు సపోర్ట్ చేయలేనని, ప్రకాష్ రాజ్ ప్యానెల్లో జనరల్ సెక్రెటరీ పదవి తప్ప అందరూ గెలవాలి.. జనరల్ సెక్రెటరీ పదవికి నేను పోటీ చేసి గెలుస్తానని అన్నారు.
తాజాగా బండ్ల గణేష్ వ్యాఖ్యలపై నటి జీవిత రాజశేఖర్ స్పందిస్తూ.. ‘‘మా’ అనేది అందరిదీ.. ఇందులో ఎవరూ ఎవరికి వ్యతిరేకం కాదు.. నాకు వ్యతిరేకంగా బండ్ల గణేష్ పోటీలో ఉంటారని,నన్ను ఆయన శత్రువుగా చూస్తున్నారని నేను అనుకోవడం లేదు.. ఎందుకంటే మా మధ్య విభేదాలు లేవు.. ‘మా’ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చెయ్యొచ్చు. నేను గెలిచినా, ఓడినా ప్రకాష్ రాజ్ ప్యానెల్లో పని చేస్తాను’’ అన్నారు. జీవిత వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.
