Jeevitha Rajasekhar: రాజశేఖర్‌కు గోటీల ఫ్యాక్టరీ ఉందా.. వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన జీవిత
రాజశేఖర్ గోటిస్ ఫ్యాక్టరీ అంటూ వైరల్ అవుతున్న న్యూస్ పై క్లారిటీ ఇచ్చిన జీవిత రాజశేఖర్(Jeevitha Rajasekhar).
- V Santhosh Kumar
- Published On : March 14, 2026 / 12:25 PM IST
Jeevitha Rajasekhar Clarifies news on Gotis Factory
Jeevitha Rajasekhar: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సెలబ్రిటీల గురించి ఏ వార్త నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టతరంగా మారింది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్‌పై పుట్టుకొచ్చిన ఒక వింత ప్రచారం నెట్టింట ట్రోల్ అవడమే కాకుండా షాక్ కి గురిచేసింది. రాజశేఖర్‌కు ఒక భారీ ‘గోటీల ఫ్యాక్టరీ’ ఉందనే వార్త గత కొద్దిరోజులుగా ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అందులో పనిచేసే వారికి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు అంటూ వస్తున్న పోస్టులు చూసి చాలామంది ఆ వార్తలు నిజమేనని అనుకున్నారు.
Samyuktha Menon: అందంతో చంపేస్తున్న సంయుక్త మీనన్.. క్రేజీ ఫొటోలు వైరల్
అయితే, ఈ వార్తలు చాలా వైరల్ అవుతుండటంతో.. రాజశేఖర్ భార్య జీవిత(Jeevitha Rajasekhar) తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తమకు గోటీల ఫ్యాక్టరీ ఉందన్న వార్త విన్నప్పుడు తాము, తమ పిల్లలు ఆశ్చర్యపోయి నవ్వుకున్నామని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో 99 శాతం అబద్ధాలే ఉంటున్నాయని, కేవలం వ్యూస్ కోసం ఎవరో ఒకరు సృష్టించిన ఇలాంటి కథనాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, కేవలం నవ్వుకోవడంతోనే ఇది ఆగలేదని, ఈ ఫ్యాక్టరీ పేరు చెప్పి కొంతమంది అమాయకుల దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని జీవిత పేర్కొన్నారు. ఇలాంటివి బాధాకరమని, ఇలాంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని ఆమె కోరారు. ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి అంశాన్ని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని, ఇటువంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. దీంతో, నటుడు రాజశేఖర్ గురించి వస్తున్న ఫేక్ వార్తలకు చెక్ పడింది.
