Jamie Lever : అల్లరి నరేష్ సినిమాతో.. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ కమెడియన్ కూతురు..

బాలీవుడ్ స్టార్ కమెడియన్ 'జానీ లీవర్' కూతురు అల్లరి నరేష్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు.

Johnny Lever daughter Jamie Lever is debut into telugu with allari naresh movie

Jamie Lever : ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ ‘జానీ లీవర్’ కుమార్తె.. టాలీవుడ్ కి అల్లరి నరేష్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జానీ లీవర్ బాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగినప్పటికీ.. ఆయన ఒక తెలుగువారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన జానీ లీవర్.. హిందీ సినిమాల్లో స్టార్ నటుడిగా ఎదిగారు. ఇక ఇన్నాళ్ల సినీ కెరీర్ లో జానీ లీవర్ ఒక్కసారి మాత్రమే.. తన మాతృభాష అయిన తెలుగు సినిమాలో నటించారు.

కానీ ఆయన కూతుర్ని మాత్రం కెరీర్ బిగినింగ్ లోనే తెలుగులోకి తీసుకు వచ్చేస్తున్నారు. జానీ లీవర్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన ‘జామీ’.. బాలీవుడ్ ఓ ఐదు సినిమాల్లోనే నటించారు. ఇప్పుడు తన ఆరో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. అల్లరి నరేష్ కొత్త సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంలో హీరో పక్కనే ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నేడు ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. అందులో అల్లరి నరేష్ తో పాటు ఆమె కూడా ఎక్కువ సీన్స్ లో కనిపిస్తూ వచ్చారు.

Also read : Hanuman : కేంద్రమంత్రి అమిత్ షాతో.. ‘హనుమాన్’ టీం భేటీ..

టీజర్ చూస్తుంటే మూవీలో జామీ లీవర్ పాత్ర ప్రధామైనదే అని తెలుస్తుంది. మరి తన తండ్రి సొంత గడ్డ అయిన తెలుగులో జామీ లీవర్ మంచి గుర్తింపుని సంపాదించుకొని అవకాశాలు అందుకుంటారేమో చూడాలి. టీజర్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న ఈ మూవీని మార్చి 22న రిలీజ్ చేయబోతున్నారు. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇక కొన్నాళ్ళు నుంచి అల్లరి నరేష్ నుంచి ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి ఈ సినిమా ట్రీట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. పెళ్లి కానీ అబ్బాయిగా అల్లరి నరేష్ కామెడీ పంచబోతున్నారు. నరేష్ అండ్ ఫరియా కాంబినేషన్ కూడా ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ ని ఇస్తుంది. మరి మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం థియేటర్స్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు