Covid : త్వరలోనే ముందుకు వస్తున్నా..రిలీఫ్‌‌లో పాలు పంచుకోండి

త్వరలోనే మీ ముందుకు వస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. రిలీఫ్ లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

Chiru

Chiranjeevi Covid Video : త్వరలోనే మీ ముందుకు వస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. రిలీఫ్ లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. మంచి పనిలో మీరూ కొంత సాయం చేయాలని..ఇండియా కోవిడ్ రెస్పాండ్ ఫండ్ కు మద్దతివ్వాలని చిరు కోరారు. కరోనా చారిటబుల్ ట్రస్టు సీసీసీ అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి. Reliance Entertainment ఫేస్ బుక్ లో లైవ్ నిర్వహించింది. వివిధ బాషలకు చెందిన నటులు, నటీమణులు మాట్లాడారు. We for India పేరిట ఫండ్ సేకరిస్తోంది. 2021, ఆగస్టు 16వ తేదీ ఉదయం 61 మంది సపోర్టు చేశారు. ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఇప్పటి వరకు 2 లక్షల 20 వేల 862 రూపాయలు ఫండ్స్ గా వచ్చాయి.

Read More : Covid-19 : దేశంలో కొత్తగా 32,937 కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కారణంగా ప్రజలు అష్టకష్టాలు పడిన సంగతి తెలిసిందే. ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోయాయి. వైరస్ విస్తరిస్తుండడంతో భారతదేశంలో లాక్ డౌన్ కొన్ని రోజుల పాటు కొనసాగింది. ఈ కారణంగా ఎన్నో రంగాలు అతలకుతాలమైపోయాయి. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ కూడా వస్తుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఫండ్స్ సేకరిస్తోంది. అందులో భాగంగా తోచిన సహాయం ఇవ్వాలని కోరుతున్నారు. చిరంజీవి కూడా వీడియోలో రిలీఫ్‌లో పాలు పంచుకోవాలన్నారు.

Read More : Soil Fertile : పచ్చిరొట్ట పైర్ల సాగు… నేల సారవంతం బహుబాగు
ఇక చిరంజీవి చిత్రాలకు వస్తే…ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది. దీని తర్వాత..లూసిఫర్ లో నటిస్తున్నారు. షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.