NTR30: వస్తున్నా.. అంటూ అలా వచ్చి ఇలా ముగించేసిన తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించింది. ఇక అప్పుడే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ముగించేశాడట తారక్.

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తోండగా, ఈ సినిమాలో తారక్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో తారక్ జాయిన్ కూడా అయ్యాడు.

NTR30: చీకట్లో విలన్లను చెడుగుడు ఆడేస్తున్న తారక్..!

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో రీసెంట్‌గా జాయిన్ అయిన తారక్, అప్పుడే తొలి షెడ్యూల్‌ను ముగించేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. తారక్ ఇంత వేగంగా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను ముగించేయడంతో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.

NTR30: ఏడాది తరువాత సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చిన టైగర్.. విధ్వంసానికి యాక్షన్ షురూ!

కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సముద్రం నేపథ్యంలో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవబోతున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాను యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు