Jr NTR : దేవర గ్లింప్స్‌లో ఇది గమనించారా? NTR ట్యాగ్ అఫీషియల్ గా మారింది.. ఇకపై యంగ్ టైగర్ కాదు..

తాజాగా నిన్న దేవర(Devara) సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూసి దేవర సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Jr NTR Devara Glimpse goes Viral New Tag for NTR by Fans

Jr NTR : ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో దేవర సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ 5 ఏప్రిల్ 2024న రిలీజ్ కానుంది. తాజాగా నిన్న దేవర(Devara) సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో సముద్రపు దొంగల్ని ఎన్టీఆర్ ఊచకోత కోస్తాడు. ఈ గ్లింప్స్ చూసి దేవర సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

అయితే దేవర గ్లింప్స్ పోస్టర్స్ లో మనం గమనిస్తే ఓ కొత్త ట్యాగ్ కనిపిస్తుంది. మన స్టార్ హీరోలందరికి పేరుకు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. అభిమానులు ఇచ్చింది లేదా సినిమా వాళ్ళు పెట్టింది ఇలా ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. ఎన్టీఆర్ కి యంగ్ టైగర్ అనే ఓ ట్యాగ్ బాగా ప్రాచుర్యంలో ఉంది. గతంలో కొంతమంది A1 స్టార్ అని కూడా రాశారు. అయితే RRR సినిమా భారీ హిట్ అయిన తర్వాత ఎన్టీఆర్ పేరుకు ముందు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అనే ట్యాగ్ ని వేస్తున్నారు అభిమానులు.

Also Read : విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన ‘కన్యాకుమారి’ టీజర్.. హీరోయిన్ హైలెట్ అసలు..

తాజాగా రిలీజ్ చేసిన దేవర గ్లింప్స్ లో ఎన్టీఆర్ పేరుకి ముందు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అని వేయడంతో అభిమానులు పెట్టిన ట్యాగ్ అఫీషియల్ గా ఎన్టీఆర్ కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఇకపై ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్టీఆర్ పేరుకి ముందు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అనే పడనుంది. దేవర సినిమాతోనే ఇది మొదలుకాబోతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు