Puneeth Rajkumar : తన స్నేహితుణ్ణి చూసి ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు..
- sekhar
- Published On : October 30, 2021 / 01:55 PM IST
Jr Ntr
Puneeth Rajkumar: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నట వారసుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సోదరుడు పునీత్ రాజ్ కుమార్ మరణంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ షాక్‌కి గురైంది. పునీత్ సన్నిహితులు ఈ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
Kannada Power Star : పునీత్ రాజ్ కుమర్ హాఠాన్మరణం, గుండెపోటుతో అభిమాని మృతి
తమ అభిమాన నటుడు ఇక లేరు అనే వార్త వినగానే గుండెపోటుతో పునీత్ అభిమాని ఒకరు కన్నుమూశారు. మరి కొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. కంఠీరవ స్టూడియోలో రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
Puneeth Rajkumar: పునీత్ చివరిచూపు కోసం బెంగుళూర్‌కు బాలకృష్ణ, ఎన్టీఆర్!!
పునీత్‌ను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు. టాలీవుడ్ నుండి నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నిర్మాత సాయి కొర్రపాటి, ప్రభుదేవా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున సీనియర్ నరేష్, శివ బాలాజీ బెంగుళూరు చేరుకుని పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
Nandamuri BalaKrishna: కన్నీరు పెట్టుకున్న బాలయ్య.. పునీత్ మృతదేహం వద్ద భావోద్వేగం
రాజ్ కుమార్ టైం నుండి ఆ కుటుంబంతో నందమూరి ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది. పునీత్ పార్థివ దేహాన్ని చూసి బాలయ్య భోరున విలపించారు. శివన్నకు ధైర్యం చెప్పారు. ఎప్పుడూ హుందాగా, గంభీరంగా కనబడే బాలయ్య భావోద్వేగంతో కంటతడి పెట్టడంతో అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. శివన్నకు ధైర్యం చెప్పారు. తారక్ – పునీత్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. పునీత్ ‘చక్రవూహ్యా’ సినిమాలో ‘గెలయా గెలయా’ అనే పాట పాడాడు ఎన్టీఆర్. ‘కె.జి.యఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా నివాళులర్పించారు.
