SYSTEM Trailer: అధికారం, న్యాయం మధ్య పోరాటం.. అంచనాలు పెంచుతున్న ‘SYSTEM’ ట్రైలర్

జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో వస్తున్న 'System' సినిమా ట్రైలర్(SYSTEM Trailer) ను మేకర్స్ విడుదల చేశారు.

Jyothika and Sonakshi Sinha Starrer System movie Trailer Released

  • ‘సిస్టమ్’ ట్రైలర్ విడుదల చేసిన ప్రైమ్.
  • సోనాక్షి, జ్యోతికల పవర్ ఫుల్ పోరాటం.
  • మే 22న గ్రాండ్ ఓటిటి రిలీజ్.

SYSTEM Trailer: ప్రైమ్ వీడియో నుంచి వస్తున్న మరో పవర్-ప్యాక్డ్ కోర్ట్ డ్రామా మూవీ ‘సిస్టమ్(SYSTEM Trailer)’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. అధికారానికి, న్యాయానికి మధ్య జరిగే ఘర్షణను ప్రతిబింబించేలా ఈ సినిమాను దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి అద్భుతంగా తెరకెక్కించారు. సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవరికేర్ వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, న్యాయ వ్యవస్థలోని లోసుగులను, మనుషుల స్వార్థ ప్రయోజనాలను ప్రశ్నించేలా ఉంది. మే 22 నుంచి ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Rj Balaji: తెలుగు సినిమాలపై డైరెక్టర్ నోటిదూల.. రిలీజ్ ముందు ఫుల్లు ట్రోల్స్.. అవసరమా ఇవన్నీ

ట్రైలర్ విషయానికొస్తే, సోనాక్షి సిన్హా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పేరు తెచ్చుకోవాలనుకునే యువ లాయర్ ‘నేహా’ పాత్రలో అదరగొట్టారు. అలాగే కోర్ట్ స్టెనోగ్రాఫర్ ‘సారిక’గా జ్యోతిక పాత్ర ఎంతో నిగూఢంగా కనిపిస్తోంది. వీరిద్దరి కలయిక వెనుక ఉన్న అసలు కారణాలు, కోర్టులో వారు ఎదుర్కొనే సవాళ్లు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా లోతైన సంభాషణలు, కోర్టు గదిలో సాగే ఉద్వేగభరితమైన సన్నివేశాలు ఈ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

కేవలం వినోదం మాత్రమే కాకుండా, “నిజం పవర్ ముందు తలవంచుతుందా?” అనే సామాజిక ప్రశ్నను ఈ సినిమా ఇతివృత్తంగా ఎంచుకుంది. తమ నటనకు ఈ చిత్రం ఒక గొప్ప సవాల్ అని సోనాక్షి, జ్యోతిక అభిప్రాయపడ్డారు. సహజత్వానికి దగ్గరగా ఉండే కథాంశాలతో వచ్చే సినిమాలకు ప్రైమ్ వీడియో సరైన వేదిక అని చిత్ర బృందం పేర్కొంది. న్యాయం కోసం జరిగే ఈ పోరాటం మే 22 నుంచి మీ డిజిటల్ స్క్రీన్స్‌పై సందడి చేయబోతోంది.