Jailer First Single : ‘వా నువ్వు కావాల‌య్యా.. నువ్వు కావాలి దా..దా..’

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం ‘జైలర్’(Jailer). బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Kaavaaalaa first single

Jailer First Single : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం ‘జైలర్’(Jailer). బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్‌. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలను మొద‌లుపెట్టింది. అందులో భాగంగానే ఈ సినిమాలోని ‘వావ్ నువ్వు కావాల‌య్యా.. కావాల‌య్యా.. దాదా’ అంటూ సాగే పాట ప్రొమోను విడుద‌ల చేసింది. త‌మ‌న్నా ఈ పాట‌ను పాడుతోంది. కావాల‌య్యా సాంగ్‌ ఫ‌స్ట్ సింగిల్ జూలై 6 న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

Dulquer Salmaan : క‌న్నీరు పెట్టుకున్న సీతారామం హీరో.. ఆదివారం రాత్రి వీడియో పోస్ట్‌.. ఆ వెంట‌నే డిలీట్‌.. ఆందోళ‌న‌లో అభిమానులు

అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించ‌గా కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, ఆర్.నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. క‌ళానిధి మార‌న్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Bandla Ganesh : ప‌వ‌ర్‌స్టార్‌కు బండ్ల గ‌ణేష్ ప్రామిస్‌.. సాయంగా ఉంటా.. లేదంటే దూరంగా ఉంటా.. అంతేగాని ప‌వ‌న్ పేరు చెప్పుకుని..

ట్రెండింగ్ వార్తలు