Kabir Duhan Singh : మ్యాథ్స్ టీచ‌ర్‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విల‌న్‌.. ఆమెకు మాత్రం హీరోగా..

ప్ర‌ముఖ న‌టుడు కబీర్ దుహాన్ సింగ్(Kabir Duhan Singh) మ్యాథ్స్ టీచ‌ర్ అయిన సీమా చాహ‌ల్‌(Seema Chahal)ను పెళ్లి చేసుకున్నాడు. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో శ‌నివారం (జూన్ 24న‌) వీరి వివాహాం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘ‌నంగా జ‌రిగింది.

Kabir Duhan Singh Marriage

Kabir Duhan Singh Marriage : ప్ర‌ముఖ న‌టుడు కబీర్ దుహాన్ సింగ్(Kabir Duhan Singh) మ్యాథ్స్ టీచ‌ర్ అయిన సీమా చాహ‌ల్‌(Seema Chahal)ను పెళ్లి చేసుకున్నాడు. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో శ‌నివారం (జూన్ 24న‌) వీరి వివాహాం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘ‌నంగా జ‌రిగింది. వీరి పెళ్లిన సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క్రీమ్ కలర్ షేర్వాణీలో క‌బీర్ దుహాన్ సింగ్ మెరిసిపోగా, ఎరుపు రంగు లెహంగాలో సీమా చాహల్ చాలా అందంగా క‌నిపిస్తోంది. కొత్త జంట‌కు నెటీజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Bholaa Shankar Teaser : ‘భోళా శంకర్’ టీజర్ రిలీజ్.. షికారుకు వచ్చిన షేర్.. స్టేట్ డివైడ్ అయినా అంతా నా వాళ్ళే..

పెళ్లైన ఆనందంలో న‌టుడు డ్యాన్స్ చేయ‌లేకుండా ఉండ‌లేక‌పోయాడు. అనంత‌రం క‌బీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ త‌న జీవితంలో నేటి నుంచి నూత‌న అధ్యాయం ప్రారంభ‌మైంద‌న్నాడు. ప్ర‌స్తుతం తాను చాలా సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పాడు. అభిమానులు, భ‌గ‌వంతుడు త‌న‌పై ప్రేమ‌ను చూపించార‌ని, ఇక నుంచి త‌న భార్య‌పై కూడా చూపించాల‌ని కోరాడు. ఆమె జీవితంలో తాను హీరోగా ఉండాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపాడు.

Kabir Duhan Singh Marriage

Nikhil Siddhartha : నాకు చాలా సార్లు డ్రగ్స్ ఆఫర్ చేశారు.. నిఖిల్ వ్యాఖ్యలు

హ‌ర్యానాకు చెందిన సీమా చాహ‌ల్ వృత్తి రీత్యా ఉఫాధ్యాయురాలు. ఆమెకు చిత్ర ప‌రిశ్ర‌మ‌తో ఎటువంటి సంబంధాలు లేవు. సీమాను క‌లిసినప్పుడు ఆమె త‌న‌ను, త‌న కుటుంబాన్ని బాగా అర్థం చేసుకోగ‌ల‌ద‌ని, చూసుకోగ‌ల‌ద‌ని అనిపించిన‌ట్లు క‌బీర్ చెప్పాడు. ఆ క్ష‌ణంలోనే ఆమె త‌న అర్థాంగి అని ఫికైన‌ట్లు వెల్ల‌డించాడు. తాను చిత్ర ప‌రిశ్ర‌మ‌తో సంబంధం లేని వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నాన‌ని అది నిజ‌మైనందుకు ఆనందంగా ఉన్న‌ట్లు తెలిపాడు.

Kabir Duhan Singh Marriage

Ruhani Sharma : రుహాణి శర్మ లేడీ ఓరియెంటెడ్ HER.. రిలీజ్ డేట్ అనౌన్స్.. నిర్మాత సురేష్‌ బాబు చేతుల మీదుగా..

2015లో జిల్ సినిమాతో టాలీవుడ్‌లో విల‌న్‌గా తెరంగ్రేటం చేశాడు కబీర్ దుహాన్ సింగ్. ఆ త‌రువాత స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌, శాంకుత‌లం వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేశాడు. తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌లో త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు