Kabjaa : ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, కబ్జ సినిమాలు ఏ ఓటీటీలో రానున్నాయో తెలుసా?
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా నేడు మార్చ్ 17న థియేటర్స్ లో రిలీజయింది.............
- Saketh U
- Published On : March 17, 2023 / 05:57 PM IST
Kabjaa and Phalana Ammayi Phalana Abbayi movies OTT Streaming Platforms
Kabjaa : నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా నేడు మార్చ్ 17న థియేటర్స్ లో రిలీజయింది. 18 నుండి 28 ఏళ్ళ వరకు ఓ జంట మధ్య జరిగిన ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. మంచి మెలోడీ లవ్ స్టోరీ అని సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఏ ఓటీటీలో రానుందో థియేటర్స్ లో స్క్రీన్ మీదే చెప్పేశారు.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో రాబోతున్నట్టు చిత్రయూనిట్ సినిమాతో పాటే ప్రకటించారు. అయితే ఎప్పుడు వస్తుందో మాత్రం ఇంకా ప్రకటించలేదు. టాలీవుడ్ సమాచారం ప్రకారం సినిమా రిలీజయిన నెల రోజులకు సన్ నెక్స్ట్ ఓటీటీలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రాబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులు జెమినీ టీవీ తీసుకుంది.
Kabjaa Movie Review : ఇది కబ్జ కాదు ఉపేంద్ర KGF.. మామూలు రివెంజ్ కథకు KGF కథనం..
అలాగే నేడు రిలీజయిన మరో సినిమా కబ్జ. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, శ్రియ జంటగా తెరకెక్కిన సినిమా కబ్జ. ఇందులో మరో ఇద్దరు కన్నడ స్టార్ హీరోలైన శివరాజ్ కుమార్, సుదీప్ గెస్ట్ అప్పీరెన్స్ లు ఇచ్చారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా భారీగా రిలీజయింది. అయితే ఈ సినిమా మాములు కథే అయినా KGF రేంజ్ లో అదే ఫార్మేట్ లో తీసారని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ సినిమా కూడా తాము అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రాబోతున్నట్టు సినిమాతోనే థియేటర్లో ప్రకటించేసింది. కబ్జ సినిమా కూడా అమెజాన్ లో నెల రోజుల్లో వస్తుందని సమాచారం.
