ప్రభాస్, మహేష్ సరసన కాజల్ అగర్వాల్
- veegam team
- Published On : December 17, 2019 / 11:16 AM IST
మొన్న ప్రభాస్, నిన్న మహేష్ బాబు.. ఇప్పుడు కాజల్ అగర్వాల్.. సౌత్ సినీ ఇండస్ట్రీలో చందమామగా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మకి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మ్యూజియంలో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ సంస్థ అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఈ అమ్మడి కొలతలు కూడా తీసుకున్నారు. ఫిబ్రవరి 5, 2020 నుండి మైనపు విగ్రహం ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానుంది. దీనిపై కాజల్ ఫుల్ హ్యాపీగా ఉంది. కాగా, ఈ గౌరవం పొందిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ గా కాజల్ అగర్వాల్ గుర్తింపు పొందింది.
లక్ష్మీ కల్యాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్.. షార్ట్ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. 2007లో వచ్చిన చందమామ సినిమాతో ఫస్ట్ హిట్ కొట్టింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం కమల్ సరసన భారతీయుడు 2 మూవీలో చేస్తోంది. హిందీలో ముంబై సగ అనే చిత్రంలో నటిస్తోంది. దాదాపు అన్ని దేశీయ భాషల్లో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాజల్ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అవుతోంది.
సెలబ్రిటీల రూపాలను మైనపు బొమ్మలుగా చేసి ప్రాణం తప్ప అన్ని ఛాయలు కనిపించేలా చేసే టాలెంట్ ఉన్న సంస్థ మేడమ్ టుస్సాడ్స్. జీవం ఉట్టిపడేలా మైనపు బొమ్మలు చేయడంలో వాళ్లు దిట్ట. ఇప్పటికే ఎంతోమంది భారత సెలబ్రిటీల మైనపు బొమ్మలను రూపొందించింది. టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు మైనపు బొమ్మలను తయారు చేసిన మేడమ్ టుస్సాడ్స్.. ఇప్పుడు ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ బొమ్మను తయారు చేసే పనిలో ఉంది. ప్రభాస్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మ్యూజియంలో ఉంచగా.. మహేష్ బాబు బొమ్మని మాత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఉంచారు.
#KajalAggarwal to get her wax statue at Madame Tussauds Singapore! To be unveiled on 5th of February 2020!! @mtssingapore pic.twitter.com/UIkiPjiacN
— Thusi (@thusi_c) December 17, 2019
