ఎంగేజ్‌మెంట్‌లో కాజల్ ఎలా మెరిసిపోయిందో చూడండి..

  • Publish Date - October 7, 2020 / 01:39 PM IST

Kajal Aggarwal – Gautam Kitchlu: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, యంగ్ బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లును పెళ్లాడనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది.




తాజాగా ఆ ఫొటోలను కాజల్ సోదరి నిషా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కాజల్ పెళ్లి ఫిక్స్ అయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పలువురు స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గౌతమ్ కిచ్లు సోదరి గౌరి కిచ్లు నాయర్ “Congratulations and all my love” అని విష్ చేస్తూ కాబోయే వధూవరులతో తాను తీసుకున్న పిక్ షేర్ చేసింది. “Thank you my adorable sister”.. అంటూ గౌరికి రిప్లై ఇచ్చింది కాజల్..
కాగా అక్టోబర్ 30న కాజల్, గౌతమ్ కిచ్లుల వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరుగనుంది.
Pic Source: kajalaggarwalofficial




ట్రెండింగ్ వార్తలు