Prabhas : ప్రభాస్‌కి ఇంకా మోకాలి గాయం తగ్గలేదా.. వైరల్ అవుతున్న ఫోటో..
ప్రభాస్‌కి ఇంకా మోకాలి గాయం తగ్గలేదా. ఆ నొప్పితోనే కల్కి షూటింగ్ చేస్తున్నారా..?
- gum 95921
- Published On : March 10, 2024 / 01:38 PM IST
Kalki 2898 AD star Prabhas is still struggling knee problem
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా నుంచి మోకాలి నొప్పితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు ‘సలార్’ రిలీజ్ కి ముందు శాస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం యూరప్ వెళ్లారు. చికిత్స చేయించుకున్న తరువాత అక్కడే నెల పాటు విశ్రాంతి తీసుకోని మళ్ళీ ఇండియా తిరిగి వచ్చారు. ఇక వచ్చిన తరువాత ప్రభాస్ కొంచెం జోష్ కనిపించడంతో.. ప్రతి ఒక్కరు ఆయన కోలుకున్నారని భావించారు.
అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫోటో.. ప్రభాస్‌కి ఇంకా మోకాలి గాయం తగ్గలేదా అనే సందేహాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రస్తుతం కల్కి మూవీ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. అక్కడ ప్రభాస్ అండ్ దిశా పటాని పై ఓ రొమాంటిక్ పాటని చిత్రీకరిస్తున్నారు. ఇక ఆ షూటింగ్ సెట్స్ నుంచి ఏదొక ఫోటో బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతుంది.
Also read : Vishwambhara : ‘విశ్వంభర’ సిస్టర్ సెంటిమెంట్‌తో రాబోతోందా.. చిరు చెల్లెళ్లు వీరేనా..
ఈక్రమంలోనే తాజాగా ప్రభాస్ ప్రైవేట్ జెట్ ఫ్లైట్ దిగుతున్న ఫోటో బయటకి వచ్చింది. ఆ ఫొటోలో ప్రభాస్.. చాలా ఇబ్బందిగా, జాగ్రత్తగా ఫ్లైట్ దిగుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక ఈ పిక్ చూసిన అభిమానులు.. ప్రభాస్ కి ఇంకా మోకాలి నొప్పి తగ్గినట్లు లేదనుకుంటా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆ మోకాలి సమస్యకి కొంచెం ఎక్కువ కాలమే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందట.
Very chic & Stylish
–#Prabhas#Kalki2898AD pic.twitter.com/dR1ull4koP— Kalki 2898AD FC (@Kalki2898AD_FC) March 10, 2024
కానీ ప్రభాస్ తన ఫ్యాన్స్ కోసం, తను ఇచ్చిన కమిట్‌మెంట్స్ కోసం తన నొప్పిని కూడా పక్కన పెట్టి పని చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా కల్కి మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఇటలీ షూట్ చేస్తున్న సాంగ్ తో మొత్తం షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ కాబోతుంది. దీపికా పదుకోన్, దిశాపటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుంటే అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
