Arjun Son Of Vyjayanthi Song : కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. విన్నారా?

తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసారు. మీరు కూడా వినేయండి..

Kalyan Ram Saiee Manjrekar Arjun Son Of Vyjayanthi Movie First Song Released

Arjun Son Of Vyjayanthi Song : కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో విజయశాంతి మళ్ళీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది. ఈ సినిమాలో విజయశాంతి తనయుడి పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు.

Also Read : Akkada Ammayi Ikkada Abbayi : యాంకర్ ప్రదీప్ సెకండ్ సినిమా.. ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ ట్రైలర్ వచ్చేసింది..

ఇప్పటికే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా టీజర్ రిలీజ్ చేసి పవర్ ఫుల్ అనిపించి అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసారు. మీరు కూడా వినేయండి..

 

నాయాల్ది.. అంటూ సాగే ఈ మాస్ పాటను అజనీష్ లోకనాథ్ సంగీత దర్శకత్వంలో రఘురామ్ రాయగా నాకాష్ అజీజ్, సోని ఈ పాటను పాడారు.