Kalyanam Kamaniyam Jeevitham : ‘కళ్యాణం కమనీయం జీవితం’.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విజయేంద్రప్రసాద్..

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేసారు. (Kalyanam Kamaniyam Jeevitham)

  • Published on- June 28, 2026 / 05:34 PM IST

Kalyanam Kamaniyam Jeevitham

Kalyanam Kamaniyam Jeevitham : ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మాణంలో రవి లోకిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే బిజీలో ఉంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేసారు.

Also Read : Jinisha Alishetty : పాపం.. ఆ దేశంలో దిగగానే 4 లక్షల విలువైన వస్తువులు పోగొట్టుకున్న కొత్త హీరోయిన్..
ఈ సందర్భంగా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. టైటిల్ చాలా బాగుంది. టైటిల్ గురించి చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను అని సినిమా టీమ్ కు అల్ ది బెస్ట్ తెలిపారు. నిర్మాతలు పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల మాట్లాడుతూ.. డైరెక్టర్ కథ చెప్పగానే తప్పకుండా ఈ సినిమా చేయాలి అనిపించింది. పాన్ వరల్డ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ గారు పోస్టర్ ను ఆవిష్కరించి టీమ్ కు బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథ, కథనంతో సినిమాని తెరకెక్కించాము. త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తాము అని తెలిపారు.

దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ సస్పెన్స్ కలయికతో ఒక ఉత్కంఠ భరితంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు.