×
Ad

Kalyani Priyadarshan: ఇరువురి కళ్ళలో ఆనందబాష్పాలు.. ఇది నా అదృష్టం.. ‘విరోష్ పెళ్లిపై’ కళ్యాణి ప్రియదర్శన్ కామెంట్స్

విజయ్- రష్మిక పెళ్లి పై ఎమోషనల్ పోస్ట్ చేసిన కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan).

Kalyani priyadarshan emotional comments about virosh wedding

  • పెళ్లితో ఒకటైన విజయ్- రష్మిక
  • స్నేహితురాలి పెళ్లిపై కళ్యాణి ప్రియదర్శన్ ఎమోషనల్ కామెంట్స్
  • ఇది నా అదృష్టం అంటూ పోస్ట్

Kalyani Priyadarshan: స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27న వీరి పెళ్లి కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయపూర్ లో జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాలతో పాటు అతికొద్ది మంది ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. అనంతరం విజయ్- రష్మిక సోషల్ మీడియా ద్వారా తమ పెళ్లిని అభిమానులతో పంచుకున్నారు. దాంతో, నెటిజన్స్ ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Virosh Wedding: పెళ్లి బంధంతో ఒకటైన విజయ్- రష్మిక.. ఫోటోలు షేర్ చేసిన కొత్త జంట

ఇదిలా ఉంటే రష్మిక పెళ్లిపై తన స్నేహితురాలు కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. విజయ్- రష్మికల పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ.. అత్యంత దయగల అమ్మాయి తన ప్రాణ స్నేహితుడిని వివాహం చేసుకోవడం నేను ఈరోజు చూశాను. ఆమె అతడి వైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు ఇద్దరి కళ్ళలో కనిపించిన ఆనందభాష్పాలు వారి ప్రేమకు గుర్తులుగా మారాయి.

ఆ అమ్మాయి తన ప్రతి అడుగు ఎన్నో భావోద్వేగ క్షణాలను మోసుకుంటూ వచ్చినట్టుగా అనిపించింది. వారి మౌనమే ప్రతీదానికి సమాధానంగా నిలిచిందిస్నేహంగా మొదలై ప్రేమగా ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. వీరికి ఇది మరో అందమైన ప్రారంభం’ అంటూ రాసుకొచ్చిది. దీంతో, కళ్యాణి ప్రియదర్శన్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.