Family Star : మరో పెళ్లి సాంగ్‌ని తీసుకొచ్చేసిన విజయ్ దేవరకొండ.. కళ్యాణి వచ్చా వచ్చా..
గీతగోవిందం సినిమాలో 'వచ్చిందమ్మ' అంటూ ఒక మంచి పెళ్లి సాంగ్ ని ఇచ్చిన విజయ్ అండ్ పరుశురామ్.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో మంచి సాంగ్ ని సిద్ధం చేసేసారు.
- gum 95921
- Updated on- March 12, 2024 / 06:40 PM IST
Kalyani Vaccha Vacchaa song released from Vijay Deverakonda The Family Star
Family Star : ‘గీతగోవిందం’ కాంబినేషన్ విజయ్ దేవరకొండ, దర్శకుడు పరుశురామ్ మరోసారి కలిసి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ఒక సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకుంది.
ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగల్ ని కూడా రిలీజ్ చేశారు. గీతగోవిందం సినిమాలో ‘వచ్చిందమ్మ’ అంటూ ఒక మంచి పెళ్లి సాంగ్ ని ఇచ్చిన విజయ్ అండ్ పరుశురామ్.. ఇప్పుడు ఈ సినిమాతో కూడా ఒక పెళ్లి సాంగ్ ని ఇవ్వబోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ లో ‘కళ్యాణి వచ్చా వచ్చా’ అంటూ సాగే ఓ మంచి మ్యారేజ్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశారు. గీతగోవిందంకి మ్యూజిక్ చేసిన గోపి సుందర్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు.
Also Read : NBK109 : బాలయ్యకి విలన్‌గా టామ్ చాకో.. ఈ కాంబినేషన్ కోసమే చూస్తున్నామంటున్న ఫ్యాన్స్..
కాగా ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు. గీతగోవిందం హిట్టుతో పాజిటివ్ బజ్ తో ఉన్న ఈ కాంబినేషన్ టీజర్ అండ్ సాంగ్స్ తో బాగానే ఆకట్టుకుంటుంది. మరి థియేటర్స్ లో మళ్ళీ గీతగోవిందం మ్యాజిక్ ని చూపిస్తారా లేదా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే.. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
