Kamal Haasan's super hit movie 'Vikram' could not cross the record of Chiranjeevi's flop movie 'Acharya'
Kamal-Chiru: యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ “విక్రమ్”. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి కమల్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచింది. అటువంటి హిట్ సినిమా చిరంజీవి ప్లాప్ మూవీ ‘ఆచార్య’ రికార్డుని దాటలేకపోయింది.
Walter Veeraiah: “వాల్తేరు వీరయ్య”తో ఊర్వశి ఐటమ్ సాంగ్..
అదేటంటే విక్రమ్ మూవీ ఇటీవలే బుల్లితెరపై ప్రసారమైంది. వెండితెరపై రికార్డ్స్ సృష్టించిన ఈ మూవీ టెలివిజన్ లో మాత్రం సత్తా చాటలేకపోయింది. టిఆర్పి విషయంలో ఈ చిత్రం ఆచార్యని అధిగమించ లేకపోయింది. ఆచార్యకి 6.30 టిఆర్పి రాగా, విక్రమ్ కి 5.10 రేటింగ్ ని నమోదు చేసింది. వెండితెరపై కంటెంట్ వలన విజయం సాదిస్తుంటే బుల్లితెరపై మాత్రం స్టార్ పవర్ వల్లే విజయాన్ని అందుకుంటున్నాయి.
ఇక చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు బాబీతో కలిసి వాల్తేరు వీరయ్య అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యపాత్ర చేస్తుండగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.