Kamal Hassan : క‌మ‌ల్ హాస‌న్ కీల‌క నిర్ణ‌యం.. బిగ్‌బాస్‌కు గుడ్ బై.. కొత్త హోస్ట్ ఎవ‌రంటే..?

మ‌న‌దేశంలో బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Kamal Hassan will not host Bigg Boss Tamil Seaon 8

Kamal Hassan – Bigg Boss Tamil : మ‌న‌దేశంలో బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపుగా అన్ని భాష‌ల్లోనూ ఈ షో విజ‌య‌వంతంగా ప‌లు సీజ‌న్ల‌ను పూర్తి చేసుకుంది. ఇక తమిళంలో ఇప్ప‌టికే ఏడు సీజ‌న్లు పూర్తి అయ్యాయి. త్వ‌ర‌లోనే ఎనిమిదో సీజ‌న్ మొద‌లు కానుంది. ఈ ఏడు సీజ‌న్ల‌కు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఎనిమిదో సీజ‌న్‌కు మాత్రం తాను హోస్ట్‌గా కొన‌సాగ‌లేన‌ని వెల్ల‌డించాడు. సినిమా క‌మిట్‌మెంట్‌ల కార‌ణంగానే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ లేఖ‌ను పోస్ట్ చేశాడు.

‘ప్రియమైన వీక్షకులారా.. ఏడేళ్ల క్రితం ప్రారంభ‌మైన ప్ర‌యాణం నుంచి నేను చిన్న విరామాన్ని తీసుకుంటున్నాను అనే విష‌యాన్ని మీకు బ‌రువెక్కిన హృద‌యంతో తెలియ‌జేస్తున్నాను. ఇంత‌క‌ముందే అంగీక‌రించిన సినిమా క‌మిట్‌మెంట్‌ల కార‌ణంగా రాబోయే బిగ్‌బాస్ త‌మిళ సీజ‌న్‌కు నేను హోస్ట్‌గా చేయ‌లేక‌పోతున్నాను. మీ ఇళ్ల‌లో మిమ్మ‌ల్ని చేరుకోవ‌డం నాకు ద‌క్కిన అదృష్టం. మీరు నా పై ఎంతో ప్రేమ‌, ఆప్యాయ‌త కురిపించారు. ఇందుకు నేను ఎప్ప‌టికీ మీకు రుణ‌ప‌డి ఉంటాను. బిగ్‌బాస్ విజ‌యంలో మీ మ‌ద్ద‌తు ఎంతో ప్ర‌ధాన‌మైంది. దేశంలోని అత్యుత్త‌మ టెలివిజ‌న్ రియాలిటి షోల‌లో బిగ్‌బాస్ త‌మిళ్‌ ఒక‌టి.’ అని క‌మ‌ల్ హాస‌న్ అన్నారు.

Rajamouli : రాజమౌళి స్టాంప్ ఏ సినిమా నుంచి మొదలయింది..? స్టాంప్ తీసేద్దామనుకున్నాడు.. కానీ..

వ్యక్తిగతంగా.. హోస్ట్‌గా ఉండటం ఒక గొప్ప గౌర‌వం అని క‌మ‌ల్ హాస‌న్ చెప్పారు. ఇక్క‌డ త‌న‌కు ఎన్నో మ‌ధుర జ్ఞాప‌కాలు ఉన్నాయన్నారు. అంద‌రితో క‌లిసి గ‌డిపిన క్ష‌ణాల‌ను మ‌రిచిపోలేన‌ని తెలిపారు. విజయ్ టీవీలోని అద్భుతమైన టీమ్‌కి, అలాగే ఈ ఎంటర్‌ప్రైజ్‌ని గ్రాండ్‌గా సక్సెస్ చేయడంలో పాలుపంచుకున్న ప్రతి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న‌ట్లు చెప్పారు. రానున్న సీజ‌న్ కూడా మంచి విజ‌యాన్ని అందుకుంటుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

క‌మ‌ల్ హాస‌న్ స్థానంలో ఎవ‌రు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు అనే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఐదో సీజ‌న్‌లో కమల్ హాసన్ కోవిడ్‌తో బాధపడుతున్నప్పుడు రమ్య కృష్ణ కొన్నాళ్లు హోస్ట్‌గా చేసింది.

Modern Masters : రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీని తెరకెక్కించింది ఎవరో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు