Bharat Bhhagya Viddhaata trailer: ముంబయి దాడుల నేపథ్యంలో కంగనా కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న ‘భారత్‌ భాగ్య విధాత’ ట్రైలర్

ముంబయి దాడుల నేపథ్యంలో కంగనా కొత్త సినిమా ‘భారత్‌ భాగ్య విధాత’ ట్రైలర్(Bharat Bhhagya Viddhaata trailer) విడుదల చేశారు మేకర్స్.

Kangana ranaut Bharat Bhhagya Viddhaata trailer released

  • కంగనా రనౌత్ ‘భారత్‌ భాగ్య విధాత’.
  • ముంబయి ఉగ్రదాడుల నేపథ్యంలో సినిమా.
  • జూన్‌ 12న థియేటర్లలో విడుదల.

Bharat Bhhagya Viddhaata trailer: 2008 నాటి 26/11 ముంబయి దాడుల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘భారత్‌ భాగ్య విధాత(Bharat Bhhagya Viddhaata trailer)’. ఆ భయానక ఉగ్రదాడుల సమయంలో ముంబయిలోని ‘కామా అండ్‌ ఆల్‌బ్లెస్‌’ ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలను ఈ సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్ర పోషించారు.

BuchiBabu Sana: ‘పెద్ది’ ట్రైలర్ పై ట్రోలింగ్.. అయితే సరైన దారిలోనే ఉన్నాం.. బుచ్చిబాబు ఫన్నీ కామెంట్స్

దర్శకుడు మనోజ్‌ తపాడియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం నాడు ఈ మూవీ అధికారిక ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఉత్కంఠ రేకెత్తించే సీన్లతో సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

కంగనా రనౌత్ తన నటనతో మరోసారి పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆపద సమయంలో వైద్యులు, నర్సులు రోగుల ప్రాణాలను కాపాడటానికి చేసిన పోరాటం అందరినీ కదిలించేలా ఉంది. జూన్ 12న విడుదల కానున్న ఈ చిత్రం దేశభక్తిని, మానవత్వాన్ని చాటిచెప్పేలా ఉంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.