Kannada star Upendra is playing the lead role in Polimera 3.
Polimera 3: పొలిమేర.. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అద్భుతమైన విజయం సాధించిన సినిమా. చేతబడి, దుష్టశక్తులు లాంటి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇక సినిమాలో వచ్చిన ట్విస్టులకు ఆడియన్స్ మైండ్ బబ్లాంక్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకు వచ్చిన ఆదరణతో సీక్వెల్ గా పొలిమేర 2 కూడా చేశారు మేకర్స్.
ఆ సినిమాను థియేటర్స్ లో విడుదల చేశారు. సీక్వెల్ కి కూడా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే, కథను అక్కడితో కూడా ఆపలేదు దర్శకుడు అనిల్ విశ్వనాధ్. దానికి సీక్వెల్ గా మూడవ పార్ట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ వచ్చి కూడా రెండేళ్లు గడుస్తోంది. కానీ, సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. పొలిమేర 2లో చాలా ట్విస్టులను రివీల్ చేయలేదు. దాంతో పొలిమేర 3(Polimera 3) కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Allu Arjun: నేను తప్పు చేశాను.. అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పిన కావేరీ
అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పొలిమేర 3 సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు అనిల్ విశ్వనాధ్. దేశవ్యాప్తంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను కిలిపి ఈ కథను సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే కథ సిద్ధం అయ్యిందని తెలుస్తోంది. ఇలాంటి కథకి పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ ఉన్న యాక్టర్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట దర్శకుడు. అందుకే, ఈ కథలో ప్రధాన పాత్ర కోసం కన్నడ స్టార్ ఉపేంద్రను తీసుకుంటున్నాడట. ఇటీవలే ఆయన్ని కలిసి కథను వివరించగా చాలా ఎగ్జైట్ అయ్యాడట ఉపేంద్ర.
వెంటనే ఒకే చెప్పేశాడట. త్వరలోనే ఆ పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియోను విడుదల చేసి రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారట. దీంతో, ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపేంద్ర లాంటి స్టార్ ఈ సినిమాలో యాడ్ అవడం అంటే మాములు విషయం కాదు. ఇప్పటికే పొలిమేర 3పై మంచి అంచనాలు ఉన్నాయి. అవి ఉపేంద్ర రాకతో రెట్టింపు అవుతున్నాయి. 2026 ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.