ఫ్యామిలీతో కరీనా 40th Birthday సెలబ్రేషన్స్..
- sekhar
- Updated on- September 21, 2020 / 01:35 PM IST
Happy Birthday Kareena Kapoor: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఈరోజు (సెప్టెంబరు 21) పుట్టినరోజు జరుపుకుంటోంది. 1980, సెప్టెంబరు 21న ఆమె జన్మించిన కరీనాకు 40వ ఏట అడుగు పెట్టింది.
తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. భర్త సైఫ్ బర్త్ డే కేకును ఆకట్టుకునేలా డిజైన్ చేయించాడు. సైఫ్, సోదరి కరిష్మా, పేరెంట్స్ రణధీర్ కపూర్, బబిత తదితరులు కరీనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.
2012లో ఆమె నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. 2016 డిసెంబరు 20న వీరికి కుమారుడు తైమూర్ జన్మించాడు. ప్రస్తుతం కరీనా గర్భవతి.. ఈ విషయాన్ని ఇటీవలే సైఫ్, కరీనా దంపతులు అధికారికంగా ప్రకటించారు.
