Sardar 2 Teaser : ‘సర్దార్ 2’ టీజర్ వచ్చేసింది.. ఇంకోసారి అదరగొట్టబోతున్న కార్తీ..

మీరు కూడా సర్దార్ 2 టీజర్ చూసేయండి.. (Sardar 2 Teaser)

  • Updated on- July 31, 2026 / 07:08 PM IST

Sardar 2 Teaser

Sardar 2 Teaser : తమిళ్ స్టార్ హీరో కార్తీ డ్యూయల్ రోల్ లో రాశిఖన్నా, రజీషా హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘సర్దార్’. ps మిత్రన్ దర్శకత్వంలో 2022లో స్పై సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వచ్చి పెద్ద హిట్ అయింది ఈ సినిమా. దాంతో అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు. ఇటీవలే సీక్వెల్ షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే సర్దార్ 2 గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

పార్ట్ 2 లో SJ సూర్య విలన్ గా కనిపించబోతుండగా మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తండ్రి పాత్రకు సంబంధించి కొంత ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ చూపించబోతున్నారు అని తెలుస్తుంది. ఈసారి తండ్రి కొడుకులు ఇద్దరూ యాక్షన్ తో అదరగొట్టబోతున్నారని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది.

Also Read : Rashmika Mandanna : గాయపడిన రష్మిక మందన్న.. ఆరు వారాలు రెస్ట్.. ఆందోళనలో అభిమానులు..

మీరు కూడా సర్దార్ 2 టీజర్ చూసేయండి..