Game Changer : మళ్ళీ గేమ్ ఛేంజర్ సినిమా వివాదంపై మాట్లాడిన కార్తీక్ సుబ్బరాజు.. నేను రాసిన స్టోరీ ఇదే..

కార్తీక్ సుబ్బరాజు తమిళ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ పై స్పందించాడు. (Game Changer)

  • Published on- October 28, 2026 / 11:34 AM IST

Game Changer

Game Changer : రామ్ చరణ్ కెరీర్లో స్టార్ దర్శకుడు శంకర్ తో సినిమా అంటూ భారీ హైప్ తో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. శంకర్ పై కూడా విమర్శలు వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా శంకర్ కథే మార్చేశాడు అనే మాట ఎక్కువ వినిపించింది.

గేమ్ ఛేంజర్ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథ అందించాడు. అధికారికంగానే ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత కార్తీక్ సుబ్బరాజు అసలు నేను ఇచ్చిన కథ అది కాదు, శంకర్ మార్చేశారు అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దాంతో చరణ్ ఫ్యాన్స్ శంకర్ పై విమర్శలు చేసారు. తాజాగా మరోసారి కార్తీక్ సుబ్బరాజు గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడటం చర్చగా మారింది.

Also Read : Bigg Boss Nominations : నామినేషన్స్ ఫైర్.. ఈ వారం ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారంటే.? త్రిగున్ ఏడుస్తుంటే నవ్వుకున్న రోహిత్..

ఇటీవల డొరొతీ అనే సినిమాతో వచ్చిన కార్తీక్ సుబ్బరాజు తమిళ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ పై స్పందించాడు.

కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ.. నా దగ్గర స్టోరీ ఉంది. ఆ స్టోరీ శంకర్ సర్ కి ఇచ్చాను. ఆయన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాయమన్నారు. కానీ అప్పుడు నేను మహాన్ సినిమాతో బిజీగా ఉన్నాను. అందుకే రాయలేదు. ఆ స్టోరీ ఒక IAS ఆఫీసర్ వేరే ఆఫీసర్స్ తో కలిసి సమాజాన్ని మార్చడం అనే పాయింట్. హిందీలో న్యూటన్ అని ఒక సినిమా ఉంది. ఒక ఎలక్షన్ ఆఫీసర్ గ్రామాలకు వెళ్లడం. కొంత అలాగే ఉంటుంది కానీ రియాల్టీగా ఉంటుంది. నేను రాసిన కథలో గ్యాంగ్ స్టార్ కూడా ఉంటాడు. నేను తమిళ్ బ్యాక్ డ్రాప్ లో ఆ కథ రాసాను. శంకర్ సర్ చేసినప్పుడు ఆ కథని పూర్తిగా మార్చేశారు. కానీ శంకర్ సర్ నా కథని వాడుకున్నారు అని హ్యాపీగానే ఉందని తెలిపాడు.

Also See : Nivetha Pethuraj : ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీరకట్టులో నివేతా పేతురేజ్.. ఫొటోలు..

దీంతో చరణ్ ఫ్యాన్స్ మరోసారి శంకర్ పై విమర్శలు చేస్తూ కార్తీక్ సుబ్బరాజు మాట్లాడిన మాటలు చర్చించుకుంటున్నారు. సమాజాన్ని మార్చడం, ఎలక్షన్ ఆఫీసర్ గ్రామాలకు వెళ్లడం, గ్యాంగ్ స్టర్.. ఇవేవి గేమ్ ఛేంజర్ సినిమాలో లేవు కదా. ఆ కథలోని IAS ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ అనే పాత్రలను తీసుకొని తండ్రి – కొడుకు కథ, రివెంజ్ స్టోరీ గా మార్చేశాడు శంకర్ అని విమర్శిస్తున్నారు. కార్తీక్ ఇచ్చిన స్టోరీ తీసుంటే హిట్ అయ్యేదేమో, కార్తీక్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తే హిట్ అయ్యేదేమో అని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్.