Allu Arjun: నేను తప్పు చేశాను.. అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పిన కావేరీ
అల్లు అర్జున్(Allu Arjun) కి క్షమాపణలు చెప్పిన బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరూవా.
- V Santhosh Kumar
- Published On : February 17, 2026 / 03:08 PM IST
Kaveri Baruah apologizes to Allu Arjun
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరూవా ఇటీవల చేసిన కామెంట్స్ ఎంతటి వివాదానికి దారి తీశాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ ను కలవాలంటే 42 రూల్స్ ఉంటాయని, వాటిని తప్పకుండా పాటించాలి అంటూ ఆమె ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో చెప్పింది. దీంతో, ఆమె చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇండియా లెవల్లో ఎక్కడ చూసినా ఆ న్యూస్ గురించే చర్చ నడిచింది. ఆ వార్తలపై అల్లు అర్జున్ టీం కూడా స్పందించింది. కేవలం అల్లు అర్జున్(Allu Arjun) ప్రతిష్టను దెబ్బతీయడానికి మాత్రమే కావేరీ అలాంటి కామెంట్స్ చేశారని క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా ఆ న్యూస్ ఆగడం లేదు. దీంతో, ఇప్పుడు స్వయంగా కావేరి బరూవా ఈ వివాదంపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నట్టుగా పోస్ట్ పెట్టింది.
Tollywood: సినిమాల పేర్లు మారుతున్నాయి.. ఇవి గమనించారా!
“కొన్నిరోజుల క్రితం నేను చేసిన పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అల్లు అర్జున్‌ను కలిసినప్పుడు చేయాల్సినవి.. చేయకూడనివి అంటూ 42 నిబంధనలు ఉంటాయని నేను చెప్పాను. అలా చెప్పడం సరైనది కాదు. 42 నిబంధనలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు లేకుండా నేను అలాంటి కామెంట్స్ చేయడం కరక్ట్ కాదు. ఆ పాడ్‌కాస్ట్‌లో నా మాటలు అలా దొర్లాయి అంతే.
అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. నేను చేసిన కామెంట్స్ వల్ల సదరు హీరో ప్రతిష్ఠకు భంగం కలిగినట్టుగా నాకు తెలిసింది. కాబట్టి, నా వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఆ హీరోకి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
— Kaveri Baruah (@kaveri_baruah) February 15, 2026
