Dhanush : కావ్య–అనిరుధ్ పెళ్లికి ధనుష్ వస్తారా?

Dhanush : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య మారన్ వివాహ వేడుకపై ఆసక్తికర చర్చ జరుగుతోంది

Kavya–Anirudh Wedding Dhanush Invitation Sparks Curiosity

Dhanush : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య మారన్ వివాహ వేడుకపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరి పెళ్లికి సినీ, స్పోర్స్‌, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అయితే అనిరుధ్ వివాహ వేడుకకు హాజరయ్యే ప్రముఖుల జాబితాపై కోలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన చర్చ వినిపిస్తోంది.

అనిరుధ్ వివాహానికి కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు టాక్. అయితే నటుడు ధనుష్‌కు మాత్రం ఆహ్వానం అందలేదనే ప్రచారం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ కుటుంబం కంఫర్ట్‌ను దృష్టిలో పెట్టుకొనే..అనిరుధ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Sachin Tendulkar : టెస్టుల్లో స‌చిన్ రికార్డుకు చేర‌వ‌గా జోరూట్‌.. స్పందించిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌..

ధనుష్, అనిరుధ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఈ వార్త మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ధనుష్‌కు నిజంగానే ఆహ్వానం అందలేదా.? రజినీకాంత్ కుటుంబం ప్రమేయంతోనే ఈ నిర్ణయం జరిగిందా.? అనేదానిపై క్లారిటీ లేకపోయినా జస్ట్‌ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే అనిరుధ్‌ పెళ్లికి ధనుష్‌కు ఇన్విటేషన్‌ అందిందని మరో చర్చ నడుస్తోంది. అయితే మ్యారేజీకి హాజరుపై ధనుష్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే సస్పెన్స్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఈ రేంజ్‌లో ఊహాగానాలు నడిచిన నేపథ్యంలో..ఆయన అనిరుధ్, కావ్య పెళ్లికి అటెండ్ అవుతారా.? లేదా అనేది కూడా చర్చకు దారి తీస్తోంది. రజినీకాంత్‌, అనిరుధ్‌కు బంధుత్వం ఉండగా..ధనుష్, అనిరుధ్ మధ్య సాన్నిహిత్య ఉంది. అయితే రజినీకాంత్, ధనుష్ కు మధ్య గ్యాప్ ఉన్నందున అనిరుధ్‌.. ధనుష్‌కు ఇన్విటేషన్ పంపారా లేదా అనే అంశం చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది.