Kayadu Lohar : ‘ది ప్యారడైజ్’ వచ్చేస్తుంది.. కానీ హీరోయిన్ కయదు లోహర్ ఎక్కడ?
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన కయదు లోహర్ మాత్రం ది ప్యారడైజ్ చేసిన ఏ ప్రమోషన్స్ లో కనిపించలేదు. (Kayadu Lohar)
- Saketh U
- Published on- September 20, 2026 / 05:09 PM IST
Kayadu Lohar
Kayadu Lohar : నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. ట్రైలర్ రిలీజ్ లేకపోయినా ఈ సినిమాకు ఫుల్ బుజ్ ఉంది. చివరి నిమిషంలో సినిమా పూర్తి చేయాలని మూవీ టెక్నికల్ టీమ్ అంతా కష్టపడుతున్నారు. ఈ మధ్యలో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.
ఈ సినిమాలో మెయిన్ రోల్స్ లో నటించిన నాని, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు వీళ్లంతా ప్రమోషన్స్ కి వచ్చారు. బిజీగా ఉన్నా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా కొన్ని ప్రమోషన్స్ కి హాజరయ్యారు. ఇంటర్వ్యూ చేసారు. నిర్మాత కూడా పాల్గొన్నారు. మోహన్ బాబు అంటే ఆయన ఇటీవల ప్రమోషన్స్ కి రావట్లేదు కాబట్టి ఎవరూ ఆయనని అడగట్లేదు. నాని కూడా చెన్నై, బెంగళూరు, కొచ్చిలలో కూడా ప్రెస్ మీట్స్ పెట్టాడు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన కీర్తి సురేష్ కూడా ఓ రీల్ చేసి ప్రమోషన్స్ లో భాగమైంది.
Also Read : Vishwak Sen : మూడు నెలల్లో మూడు సినిమాలతో రాబోతున్న విశ్వక్.. వరుస ఫ్లాప్స్ కి చెక్ పెడతాడా?
కానీ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన కయదు లోహర్ మాత్రం ది ప్యారడైజ్ చేసిన ఏ ప్రమోషన్స్ లో కనిపించలేదు. గతంలో కయదు లోహర్ చేసిన అన్ని సినిమాల ప్రమోషన్స్ కి బాగానే హాజరైంది. కానీ ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా కనపడకపోవడంతో హీరోయిన్ ఎక్కడా అని అడుగుతున్నారు. ఒకవేళ వేరే సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నా చెన్నై, బెంగళూరు, కొచ్చిలలో ప్రమోషన్స్ చేసారు. వాటిల్లో ఏదో ఒక చోటికి కూడా ఒక్క రోజైనా రాలేదు.
మరి కయదు అసలు అందుబాటులో లేరా? వేరే దేశాల్లో ఉన్నారా? లేక మూవీ టీమ్ తో ఏదైనా సమస్య ఉందా అని చర్చగా మారింది. త్వరలో హైదరాబాద్ లో ది ప్యారడైజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కి అయినా కయదు లోహర్ వస్తుందో లేదో చూడాలి. ఈ ఈవెంట్ కి కూడా రాకపోతే ది ప్యారడైజ్ సినిమాకు హీరోయిన్ దూరం అంటూ చర్చ జరగడం ఖాయం.
