Good Luck Sakhi: కీర్తి సురేష్ ‘గుడ్‌లక్ సఖి’ డేట్ ఫిక్స్!
మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి చిత్రంతో ప్రతి ఒక్కరిని అలరించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించడంతో పాటు..
- Naresh Mannam
- Published On : November 1, 2021 / 08:12 PM IST
Good Luck Sakhi
Good Luck Sakhi: మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి చిత్రంతో ప్రతి ఒక్కరిని అలరించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించడంతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయింది. ఒకవైపు స్టార్ హీరోలతో ఆడిపాడుతూనే మరో వైపు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో వస్తుంది. కీర్తి నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా ఇప్పటికే విడుదల కాగా, ఇవి బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి.
Raja Vikramarka: కామిక్ టచ్‌తో యాక్షన్.. ‘రాజా విక్రమార్క’ ట్రైలర్!
ఇక, ఇప్పుడు కీర్తి నటించిన మరో లేడి ఓరియెంటెడ్ చిత్రం గుడ్ లక్ సఖీ తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించుకుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. ఈ ఏడాది జూన్ 3వ తేదీన రిలీజ్ కు ప్రకటన కూడా ఇచ్చారు. కానీ కరోనా వలన వాయిదా పడుతూ వచ్చి.. ఇప్పుడు ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. గుడ్ లక్ సఖి చిత్రాన్ని నవంబర్ 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు యూనిట్ తాజాగా ప్రకటించింది.
Nargis Fakhri: నర్గీస్ అసలేంటీ అందం..!
తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషలలోను విడుదల కానున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి నిర్మించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం విశేషం.
