KGF2: కేజీయఫ్2 సరికొత్త రికార్డు.. 50 డేస్ కంప్లీట్!
కన్నడలో తెరకెక్కిన ‘కేజీయఫ్ చాప్టర్ 1’ సాధించిన బ్లాక్ బస్టర్ విజయానికి ఈ సినిమా సీక్వెల్ చిత్రం అయిన ‘కేజీయఫ్ చాప్టర్ 2’పై కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు....
- Anil Aaleti
- Published On : June 2, 2022 / 12:42 PM IST
Kgf2 Completes 50 Days Theatrical Run
KGF2: కన్నడలో తెరకెక్కిన ‘కేజీయఫ్ చాప్టర్ 1’ సాధించిన బ్లాక్ బస్టర్ విజయానికి ఈ సినిమా సీక్వెల్ చిత్రం అయిన ‘కేజీయఫ్ చాప్టర్ 2’పై కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే, పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లతో సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తొలి భాగానికి మించిన రెస్పాన్స్ ఈ రెండో పార్ట్ కు రావడంతో ‘కేజీయఫ్ చాప్టర్ 2’కు అన్ని వర్గాల ప్రేక్షకులు జేజేలు కొట్టారు.
KGF2: కేజీయఫ్ 2 @ 400.. నాటౌట్!
ఇక ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లను నెక్ట్స్ లెవెల్ లో చూపించడంలో సక్సెస్ కావడం.. రాకింగ్ స్టార్ యశ్, మరోసారి తన యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ మరోసారి కేజీయఫ్ స్టామినా ఏమిటో యావత్ ఇండియన్ బాక్సాఫీస్ కు చూపించింది.
KGF2 రికార్డుల మోత.. రామ్, భీమ్‌లను దాటేసిన రాఖీభాయ్!
కాగా.. ఈ సినిమా తాజాగా మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకుంది. ఇటీవల సినిమాలు ఎక్కువ రోజుల పాటు థియేటర్స్ లో ఆడటం దాదాపు గగనంగా మారిపోయింది. అయితే ఓ కమర్షియల్ సినిమాగా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 2 తాజాగా ఏకంగా 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుని ఔరా అనిపించింది. ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీకి కేవలం సౌత్ లోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా పట్టం కట్టడంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా 390+ సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక ఈ సినిమాను జూన్ 3 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు పెడుతుండటంతో ఓటీటీలోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రాఖీ భాయ్ రెడీ అవుతున్నాడని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
We Complete 50 days in more than 400 centres across the world. Thanks to everyone involved #KGF2 @hombalefilms @TheNameIsYash @prashanth_neel pic.twitter.com/Wdz8m7Tytg
— Karthik Gowda (@Karthik1423) June 2, 2022
