నాకా, భయమా?.. అన్నపూర్ణలో షూటింగ్ స్టార్ట్ చేసిన కిచ్చా సుదీప్..
- sekhar
- Published On : July 17, 2020 / 02:23 PM IST
కరోనా కారణంగా పలు ఇండస్ట్రీలలో షూటింగులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇటీవల తిరిగి కొన్ని సీరియల్స్ షూటింగులు స్టార్ట్ అయ్యాయి కానీ కేసులు పెరగడంతో చాలా వరకు ఆపేశారు. అయితే షూటింగ్ చేయడానికి ఎవరు భయపడ్డా! తానేం తగ్గేది లేదు అని అంటున్నారు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ప్రభుత్వాలు షూటింగ్స్‌ను కొన్ని విధి విధానాల్లో చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే తెలుగు హీరోలు తమ షూటింగ్స్‌ను స్టార్ట్ చేయడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో కిచ్చా సుదీప్ మాత్రం ముందడుగేశారు.
