Chennai Love Story day 1 collection : చెన్నై ల‌వ్ స్టోరీ తొలి రోజు క‌లెక్ష‌న్ ఎంతంటే ?

కిరణ్ అబ్బవరం న‌టించిన చెన్నై ల‌వ్ స్టోరీ చిత్రం తొలి రోజు వ‌సూళ్ల వివ‌రాల‌ను (Chennai Love Story day 1 collection) మూవీ యూనిట్ వెల్ల‌డించింది.

Kiran Abbavaram Chennai Love Story day 1 collection

Chennai Love Story day 1 collection : కిరణ్ అబ్బవరం న‌టించిన లేటెస్టు చిత్రం చెన్నై ల‌వ్ స్టోరీ. రవి నంబూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శ్రీ గౌరీప్రియ క‌థానాయిక‌. SKN, సాయి రాజేష్, ధీరజ్ లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు. జూలై 24న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చింది. తొలి రోజు ఈ చిత్ర వ‌సూళ్ల వివ‌రాల‌ను మూవీ యూనిట్ తాజాగా వెల్ల‌డించింది.

ప్రీమియ‌ర్లు, తొలి రోజు మొత్తం క‌లిపి ప్ర‌పంచ వ్యాప్తంగా 12.3 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు ఈ చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ మేర‌కు ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇక నేడు శ‌నివారం, రేపు ఆదివారం కావ‌డంతో చిత్ర వ‌సూళ్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ విశ్లేష‌కులు అభిఫ్రాయ ప‌డుతున్నారు.

Akhil Akkineni : సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన అఖిల్.. నేను ఇండియ‌న్‌ను కాదు.. త్వ‌ర‌లోనే..