Chennai Love Story : వామ్మో.. కిరణ్ అబ్బవరం రేంజ్ ఇంత పెరిగిందా? షాకిస్తున్న చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ బిజినెస్..
ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. (Chennai Love Story)
- Saketh U
- Published on- July 14, 2026 / 07:47 AM IST
Chennai Love Story
Chennai Love Story : కొన్నాళ్ల క్రితం వరుసగా ఫ్లాప్స్ చూసిన కిరణ్ అబ్బవరం వరుసగా హిట్స్ కొడుతున్నాడు. క, కె ర్యాంప్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. నిర్మాతగా కూడా ఇటీవలే తిమ్మరాజు పల్లి టీవీ సినిమాతో హిట్ కొట్టాడు. దాంతో కిరణ్ అబ్బవరం నుంచి రాబోయే చెన్నై లవ్ స్టోరీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం.
కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ సినిమాను ఆల్రెడీ 14 కోట్లు ఇచ్చి ఓ ఓటీటీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జులై 24న రిలీజ్ అవుతుండగా చాలా ముందుగానే థియేటరికల్ బిజినెస్ కూడా అయిపోవడం గమనార్హం. ఈ సినిమా ఆంధ్రలో 8 కోట్లకు, నైజాంలో 8 కోట్లకు, సీడెడ్ లో 3 కోట్లకు అమ్ముడుపోయిందని సమాచారం. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి దాదాపు 4 కోట్లకు కొనుక్కున్నారట. అలా దాదాపు 23 కోట్లకు థియేటరికల్ బిజినెస్ జరిగింది. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్లోనే హైయెస్ట్.
ఇక ఈ సినిమాకి ఆడియో రైట్స్ కింద కూడా దాదాపు 5 కోట్లు వచ్చాయట. ఇంకా శాటిలైట్, హిందీ రైట్స్ అమ్ముడవ్వల్సి ఉంది. అయితే ఈ సినిమాకు బేబీ సినిమా కూడా బాగా కలిసి వచ్చింది. నిర్మాత SKN నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబీ సినిమా 10 కోట్లతో తీస్తే ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే నిర్మాత, అదే డైరెక్టర్ కథ ఇవ్వడం, అదే బ్యానర్ కావడంతో ఈ సినిమాపై బేబీ ఎఫెక్ట్ కూడా పడి బిజినెస్ ఈజీ అయింది.
చెన్నై లవ్ స్టోరీ సినిమాని 20 నుంచి 25 కోట్ల లోపే పూర్తి చేయగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి దాదాపు 40 కోట్లకు పైగా బిజినెస్ అయింది. కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమా లాభాల్లో వాటా తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో మేకర్స్ కి కూడా ఖర్చు తగ్గింది . మొత్తానికి చెన్నై లవ్ స్టోరీ ఫుల్ ప్రాఫిట్ సినిమా నిర్మాతలకు.
