Kiran Abbavaram : పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత SR కల్యాణమండపం సినిమాతో మంచి విజయం సాధించాడు. అప్పట్నుంచి సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు కిరణ్. ఇటీవలే రూల్స్ రంజన్ సినిమాతో పలకరించగా ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు.
తాజాగా పీపుల్స్ మీడియా అషురెడ్డి(Ashu Reddy) హోస్ట్ గా ‘దావత్'(Daawath) అని ఓ షో మొదలుపెట్టగా అందులో మొదటి ఎపిసోడ్ కి కిరణ్ అబ్బవరం గెస్ట్ గా వచ్చాడు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో పలు విషయాలు తెలిపాడు కిరణ్ అబ్బవరం. అయితే అషు రెడ్డి.. కిరణ్, రహస్య గోరఖ్(Rahasya Gorak) రిలేషన్ లో ఉన్నారా అని అడగగా దీనికి కిరణ్ సమాధానమిస్తూ.. అలాంటిదేమి లేదు, ఉంటే మేమే చెప్తం కదా అని అన్నాడు. ఏం చెప్తారు, ఇద్దరూ కలిసి డేట్ అనౌన్స్ చేస్తారా అని అషురెడ్డి మళ్ళీ ప్రశ్నించింది. దీంతో కిరణ్.. ఎప్పుడూ దొరకలేదు, ఈ షోలో ఏంటి ఇలా దొరికిపోయాను అని సిగ్గుపడ్డాడు.
రహస్య గోరఖ్, కిరణ్ అబ్బవరం కలిసి వాళ్ళ మొదటి సినిమా రాజావారు రాణిగారులో కలిసి నటించారు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కిరణ్ ఇంటికి కూడా రహస్య పలుమార్లు వెళ్లినట్టు సమాచారం. ఇద్దరూ కలిసి కాశ్మీర్ కి వెకేషన్ కి కూడా వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ దావత్ షోలో రహస్య పేరు చెప్పగానే కిరణ్ అబ్బవరం సిగ్గుపడిపోవడంతో నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారా అని సందేహాలు వస్తున్నాయి. మరి దీనిపై కిరణ్ కానీ, రహస్య కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.