Kiran Abbavaram : వరుస హిట్స్.. కిరణ్ అబ్బవరం రేటు పెంచేసాడా.. ఏకంగా..
తాజాగా కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ భారీగా పెంచేసాడని టాక్ నడుస్తుంది. (Kiran Abbavaram)
- Saketh U
- Published On : February 23, 2026 / 04:54 PM IST
Kiran Abbavaram
Kiran Abbavaram : యంగ్ హీరోలలో ఇప్పుడు కిరణ్ అబ్బవరం మినిమమ్ గ్యారెంటీ హీరో. ఇటీవలే క, కె ర్యాంప్ సినిమాలతో భారీ విజయాలు సాధించాడు. దీంతో కిరణ్ మార్కెట్ పెరగడమే కాకుండా వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. మరో పక్క నిర్మాతగా కూడా మారి కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తున్నాడు.(Kiran Abbavaram)
తాజాగా కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ భారీగా పెంచేసాడని టాక్ నడుస్తుంది. కిరణ్ అబ్బవరం మొన్నటివరకు సినిమాకు మూడు నుంచి 5 కోట్లు తీసుకున్నాడని టాక్. ఇప్పుడు ఏకంగా 12 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. వరుస హిట్లు అందుకున్న హీరోలకు నిర్మాతలు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం అలాంటి డిమాండ్ ఉన్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ముందు వరసలో ఉన్నాడు.
టాలీవుడ్ సమాచారం ప్రకారం ప్రస్తుతం కిరణ్ ఒక్కో సినిమాకు దాదాపు 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో సినిమా ఒప్పందం కుదుర్చుకున్న కిరణ్ ఆ సినిమాకు 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.
ఇక కిరణ్ అబ్బవరం లైనప్ లో చెన్నై లవ్ స్టోరీ సినిమా, సుకుమార్ నిర్మాణంలో ఒక సినిమా, అమెజాన్ కి ఒక వెబ్ సిరీస్, బాలీవుడ్ సినిమా ఒకటి, కిరణ్ అబ్బవరం సొంత డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది. ఇలా ఆల్మోస్ట్ అరడజను సినిమాలు లైనప్ లో ఉన్నాయి కిరణ్ అబ్బవరంకి. అయినా వరుస ఫ్లాప్ లు ఇస్తున్న మీడియం రేంజ్ హీరోలే 7 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నారు, హిట్స్ కొడుతూ ప్రమోషన్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండే కిరణ్ 12 కోట్లు తీసుకుంటే తప్పు లేదు అని ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Vishal : విజయ్ కోసం 1500 మందితో ధర్నా చేస్తానంటున్న విశాల్.. ఎందుకో తెలుసా?
