Kiran Abbavaram: భరత్ కమ్మాతో ‘గువ్వల చెరువు గట్టు’.. ఆసక్తికరంగా కిరణ్ అబ్బవరం కొత్త ప్రాజెక్టు
దర్శకుడు భరత్ కమ్మాతో వెబ్ సిరీస్ చేస్తున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).
- V Santhosh Kumar
- Published On : February 27, 2026 / 02:37 PM IST
Kiran Abbavaram is working on a web series with director Bharat Kamma
Kiran Abbavaram: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు ఒకే చెప్తున్నాడు. ఇటీవలే ఆయన కెరీర్ లో రెండు బ్లాక్ బస్టర్స్ పడిన విషయం తెలిసిందే. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ‘క’, కామెడీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘కె-ర్యాంప్’. ఈ రెండు సినిమాలు కూడా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అందుకే, ఆయన తన తదుపరి సినిమాలపై చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను సిద్ధం చేసుకుంటున్నాడు.
ఈనేపథ్యంలోనే కిరణ్ అబ్బవరం ఒక క్రేజీ ప్రాజెక్టును ఒకే చేశాడు. అయితే ఆ ఆ ప్రాజెక్టు సినిమా కాదు వెబ్ సిరీస్. అవును, కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ తో కలిసి రూరల్ థ్రిల్లర్ జానర్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు భరత్ కమ్మా తెరకెక్కిస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాను తెరకెక్కించాడు.
దాదాపు ఏడేళ్ల తరువాత ఈ దర్శకుడు మెగా ఫోన్ పెట్టుకుంటున్నాడు. దీంతో, ఈ ప్రజెక్టుపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ ప్రాజెక్టుకి ‘గువ్వల చెరువు గట్టు’ అనే వింత టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉండనుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంతకాలం సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం ఓటీటీలో ఏమేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.
