×
Ad

Kiran Abbavaram : మొదటి సినిమా హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్..

మొదటి సినిమా హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం. ఎంగేజ్మెంట్ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారట.

  • Published On : March 11, 2024 / 03:22 PM IST

Kiran Abbavaram ready to engage with his first movie actress Rahasya Gorak

Kiran Abbavaram : టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారట. తన అయిదేళ్ల ప్రేమని నిజం చేసుకుంటూ.. ఏడడుగులు వేయడానికి సిద్దమవుతున్నారట. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ ని సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో 2019లో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘రహస్య గోరఖ్’ నటించారు.

ఈ మూవీ సమయంలోనే కిరణ్ అండ్ రహస్య మధ్య ప్రేమ చిగురించింది. ఇక ఆ ప్రేమలో ఇన్నాళ్లు ప్రయాణిస్తూ వచ్చిన ఈ ఇద్దరు.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారట. అయితే ఈ ప్రేమ విషయాన్ని కిరణ్ అబ్బవరం రహస్యంగానే ఉంచుతూ వచ్చారు. కాగా ఈ బుధవారం మార్చి 13న.. కిరణ్ అండ్ రహస్య ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని పెళ్లి జీవితానికి మొదటి అడుగు వేయబోతున్నారట.

Also read : Surya Kiran : టాలీవుడ్‌లో విషాదం.. బిగ్‌బాస్ ఫేమ్, ‘సత్యం’ దర్శకుడు సూర్యకిరణ్‌ మరణం..

ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజెన్స్.. కిరణ్ అబ్బవరంకి కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు. కాగా రహస్య ‘రాజా వారు రాణి గారు’ సినిమా తరువాత ‘సర్బాత్’ అనే తమిళ్ సినిమాతో మాత్రమే ఆడియన్స్ ని పలకరించారు. ఆ చిత్రం తరువాత మళ్ళీ మరో సినిమా చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ ఆడియన్స్ కి టచ్ లో ఉంటున్నారు.

కాగా కిరణ్ అబ్బవరం గత ఏడాది మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరి ఈ ఏడాది ఏ సినిమాలతో రాబోతున్నారు అనేది మాత్రం ఇంకా తెలియజేయలేదు. సైలెంట్ గానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. మరి త్వరలోనే ఎలాంటి సినిమాలతో వస్తారో చూడాలి.