Upasana : మా తాతయ్యకు అప్పుడు.. నా కూతురి తాతయ్యకు ఇప్పుడు.. అంటూ ఉపాసన ఆసక్తికర కామెంట్స్
ఉపాసన కొణిదెల.. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి మాత్రమే కాదు అపోలో హస్పిటల్స్ ఫౌండర్ డా.ప్రతాప్ చంద్ర రెడ్డి మనువరాలు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Updated on- February 6, 2024 / 07:01 PM IST
Klin kara Grand Father Has Padma Vibhushan Upasna intresting comments
Upasana intresting comments : ఉపాసన కొణిదెల.. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి మాత్రమే కాదు అపోలో హస్పిటల్స్ ఫౌండర్ డా.ప్రతాప్ చంద్ర రెడ్డి మనువరాలు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఉపాసనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫిబ్రవరి 5 సోమవారం ప్రతాప్ చంద్ర రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ‘ది అపోలో స్టోరీ’ అనే పుస్తకాన్ని ఉపాసన లాంఛ్ చేసింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం పట్ల ఎలా అనిపిస్తుందని అడుగగా.. ఉపాసన చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది.
ఉపాసన గ్రాండ్ ఫాదర్ మాత్రమే కాదు ఇప్పుడు క్లిన్ కారా గ్రాండ్ ఫాదర్ కూడా పద్మ విభూషణ్ అందుకున్నారు. మా కుటుంబంలో ఇద్దరు ఈ పురస్కారం అందుకోవడం నిజంగా ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అని ఉపాసన అంది.
Rashmika Mandanna : రష్మిక రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలకు.. కౌంటర్ ఇచ్చిన రష్మిక..
సినీ రంగంలో చేసిన సేవలకు గానూ మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 2010లో ప్రతాప్ చంద్ర రెడ్డి కూడా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
