Klin Kaara : హమ్మయ్య.. ఎట్టకేలకు క్లిన్ కారా ఫేస్ రివీల్ చేసిన చరణ్ – ఉపాసన.. క్యూట్ ఫ్యామిలీ ఫోటో వైరల్..
మెగా అభిమానులు అంతా క్లిన్ కారాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. (KlinKaara)
- Saketh U
- Updated on- June 20, 2026 / 05:21 PM IST
Klin Kaara : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా పుట్టడంతోనే పెద్ద సెలబ్రిటీ. మెగా అభిమానులు అంతా క్లిన్ కారాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు అసలు చరణ్, ఉపాసన, చిరంజీవి, మెగా ఫ్యామిలీ ఎవరూ క్లిన్ కారా ఫేస్ చూపించలేదు.
ఇప్పటికే పలుమార్లు క్లిన్ కారా ఫోటోలు బయట పెట్టినా ఎక్కడా ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. రామ్ చరణ్ తండ్రిగా ప్రమోషన్ వచ్చాక ఎక్కువ సమయం క్లిన్ కారాతోనే గడుపుతున్నాడని మెగా కుటుంబసభ్యులు పలుమార్లు తెలిపారు. తాజాగా క్లిన్ కారా పుట్టిన రోజు సందర్భంగా మొదటిసారి క్లిన్ కారా ఫేస్ ని చూపించారు. రామ్ చరణ్ – ఉపాసన కలిసి క్లిన్ కారాని ఎత్తుకున్న ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Also Read : Samantha : తల్లి కాబోతున్న ‘సమంత’..? భర్తతో కలిసి సందడి చేసిన సామ్.. బేబీ బంప్ అంటూ వీడియోలు వైరల్..
నేడు జూన్ 20 క్లిన్ కారా పుట్టిన రోజు. 2023 లో క్లిన్ కారా పుట్టింది. మూడేళ్ళ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ జంట తమ కూతురు క్లిన్ కారా ఫోటోని బయటపెట్టారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఎంత క్యూట్ గా ఉందో అంటూ క్లిన్ కారా గురించి కామెంట్స్ చేస్తున్నారు, క్లిన్ కారా మొదటి ఫోటో కావడం, చరణ్ – ఉపాసన కలిసి ఎత్తుకొని కనిపించడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
ఇటీవల జనవరిలో ఈ జంటకు కవలలు పుట్టగా వారికి శివరామ్, అన్వీరా దేవి అని పేర్లు పెట్టినట్టు ప్రకటించారు. మరి ఆ ఇద్దరి ఫేస్ లను ఎప్పుడు రివీల్ చేస్తారో .
