Kokapet Aunty : ఎకరం వందకోట్లు.. కోకాపేట ఆంటీ అప్పుడే చెప్పింది..

హైదరాబాద్ శివార్లలో ఉన్న కోకాపేట నియోపోలీస్‌ లే అవుట్‌ లో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. HMDA కోకాపేట వద్ద ఉన్న కొన్ని భూమలు అమ్మకానికి వేలం వేయగా ఎకరం కోట్లల్లో పలికాయి. అయితే ఓ ఫ్లాట్ మాత్రం ఎకరాకు ఏకంగా 100 కోట్లకు పైగా పలికింది.

  • Updated on- August 4, 2023 / 10:11 AM IST

Kokapet 1 Acre Land Values 100 Crores Tulasi Movie Kokapet Aunty goes Viral

Kokapet Aunty : ఒక్కోసారి సినిమాల్లో చెప్పినవి తూచ తప్పకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. సినిమాల్లో ముందే ఊహించి చెప్పిన కొన్ని సన్నివేశాలు నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటిదే ఓ సంఘటన జరిగింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న కోకాపేట నియోపోలీస్‌ లే అవుట్‌ లో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. HMDA కోకాపేట వద్ద ఉన్న కొన్ని భూమలు అమ్మకానికి వేలం వేయగా ఎకరం కోట్లల్లో పలికాయి. అయితే ఓ ఫ్లాట్ మాత్రం ఎకరాకు ఏకంగా 100 కోట్లకు పైగా పలికింది. 3.60 కోట్ల బిట్ కి ఏకంగా 360 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఒక ఎకరం భూమి రేటు ఇంత ధర పలకడం ఇదే మొదటిసారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

 

అయితే గతంలోనే కోకాపేటలో భూములు అమ్మితే బోలెడు డబ్బులొస్తాయని తులసి సినిమాలో చూపించారు. వెంకటేష్, నయనతార కలిసి నటించిన తులసి సినిమాలో నటి ఝాన్సీ కోకాపేట ఆంటీ అనే క్యారెక్టర్ చేసింది. మంచి కామెడీ క్యారెక్టర్ గా ప్రేక్షకులని మెప్పించింది. ఈ సినిమాలో ఝాన్సీ ఓ సన్నివేశంలో మాట్లాడుతూ.. మాకు కోకాపేటలో ఉన్న భూమి అమ్మితే ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత డబ్బులు వచ్చాయి. అందుకే నన్ను అందరూ కోకాపేట ఆంటీ అంటారు అని చెప్పింది. తులసి సినిమా 2007లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 16 ఏళ్ళ క్రితమే ఆ దర్శకుడు కోకాపేట రియల్ ఎస్టేట్ బూమ్ గురించి ఆలోచించి ఆ డైలాగ్ పెట్టాడు.

Malavika Sharma : పేద పిల్లలకు స్వయంగా చెప్పులు తొడుగుతున్న హీరోయిన్..

ఎకరం వంద కోట్లు పలకడంతో నిన్నటి నుంచి కోకాపేట వార్తల్లో నిలుస్తుంది. దీంతో ఇప్పుడు కోకాపేట ఆంటీ కూడా వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో కోకాపేట ఆంటీ ఫోటోలు, వీడియోలతో కోకాపేట భూముల ధరలపై వ్యాఖ్యలు చేస్తున్నారు.