Kona Venkat talks about the humiliation faced by Ravi Teja on the film sets
Ravi Teja: మాస్ మహారాజ్ రవి తేజ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు రవి తేజ. అలా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి మాస్ మహారాజ్ గా ఆయన ప్రయాణం ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అంతేకాదు, తనలా కష్టపడి పైకి వచ్చిన చాలా మంది డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చాడు రవితేజ.
కానీ, కెరీర్ తొలినాళ్లలో మాత్రం ఆయన చాలా కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నడట. రవితేజ ఎదుర్కొన్న ఒక సంఘటన గురించి తాజాగా వివరించాడు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్. ఆయన నిర్మాణంలో వస్తున్న లేటెస్ట్ మూవీ బ్యాండ్ మేళం. కోర్ట్ జంట రోషన్- శ్రీదేవి నటిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.
Vijay- Trisha: త్రిషతో కలిసి పెళ్లికొచ్చిన విజయ్.. ఇద్దరు ఒకే కారులో.. ఇద్దరి రిలేషన్ నిజమేనా?
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కోన వెంకట్ రవి తేజ(Ravi Teja)కు జరిగిన అవమానం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ..” ఒక రోజు సినిమా షూటింగ్ లో అనడం భోజనం చేస్తున్నాం. అదే సినిమాకు రవి తేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. అక్కడ రవి తేజ కూడా తింటున్నాడు. ఆ చిత్ర నిర్మాత వచ్చి అడ్డమైన వాళ్ళు అందరు తింటున్నారు అన్నాడు. ఆరోజు రవి తేజ చాలా ఇబ్బంది పడ్డాడు.
కానీ, తాను హీరో అయ్యాక అదే నిర్మాతకు అవకాశం ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అది రవి తేజ అంటే’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు కోన వెంకట్. దీంతో, కోన వెంకట్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.