Balayya- Koratala: ఒకరు హ్యాపీ.. ఒకరు డిజప్పాయింట్.. బాలయ్య సినిమాతో దేవర 2పై క్లారిటీ
త్వరలో మొదలుకాబోతున్న బాలకృష్ణ, కొరటాల శివ మూవీ(Balayya- Koratala).
Koratala Siva Balakrishna movie officially starting soon
- డ్రాగన్ ఆలస్యం వల్లే దేవర 2 పక్కకి
- బాలయ్యతో సినిమా సెట్ చేసుకున్న కొరటాల
- ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్, బాలయ్య ఫ్యాన్స్ హ్యాపీ
Balayya- Koratala: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవతుండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు అత్యంత వేగంగా ముగిశాయని, కేవలం సింగిల్ సిటింగ్‌లోనే బాలయ్య ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు కావడంతో, బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను కొరటాల సిద్ధం చేశారట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభం కానుంది.
Neha shetty: స్టన్నింగ్ లుక్ లో నేహా శెట్టి.. గోల్డ్ కలర్ అవుట్‌ఫిట్‌లో పరువాల విందు.. ఫొటోలు
వాస్తవానికి కొరటాల శివ తన తదుపరి చిత్రంగా ‘దేవర 2’ చేస్తారని అందరూ భావించారు. అయితే, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మారడం, అది పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పట్టేలా ఉండటంతో సమీకరణాలు మారిపోయాయి. ఎన్టీఆర్ అందుబాటులో లేని ఈ విరామ సమయాన్ని వృధా చేయకూడదని భావించిన కొరటాల, బాలయ్య(Balayya- Koratala)తో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. దీనివల్ల ప్రస్తుతానికి ‘దేవర 2’ ప్రాజెక్టు కాస్త పక్కకు జరిగినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామం నందమూరి అభిమానుల్లో భిన్నాభిప్రాయాలను కలిగిస్తోంది. బాలయ్య, కొరటాల శివ వంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వారిద్దరి కలయికలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ‘దేవర 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ ఆలస్యం పట్ల కొంత అసహనానికి లోనవుతున్నారు. ఏదేమైనా, ఈ కొత్త ప్రాజెక్ట్ టాలీవుడ్లో సరికొత్త సంచలనానికి తెరలేపడం ఖాయంగా కనిపిస్తోంది.
