Sharwa35 : కృతిశెట్టికి బర్త్ డే విషెస్.. శర్వానంద్ సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

శర్వానంద్ 35వ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఈ భామ పుట్టినరోజు కావడంతో..

Krithi Shetty special video out from Sharwa35 on her birthday

Sharwa35 : ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి (Krithi Shetty).. ఆ తరువాత కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్టులు అందుకొని టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది. కానీ ఆ నెక్స్ట్ నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అమ్మడికి చుక్క ఎదురైంది. ప్రస్తుతం ఈ భామ.. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో కూడా చెరొక మూవీ చేస్తుంది. టాలీవుడ్ లో శర్వానంద్ (Sharwanand) 35వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. నేడు కృతి పుట్టినరోజు కావడంతో మూవీ టీం ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.

Santosh Sobhan : 100 షార్ట్ ఫిలిమ్స్ తీసిన యూట్యూబర్స్‌తో.. సంతోష్ శోభన్ కొత్త సినిమా..

ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుంచి కృతికి సంబంధించిన విజువల్స్ ని రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలియజేశారు మేకర్స్. ఇక ఈ వీడియోలో కృతిశెట్టి లుక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. ఇంకా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. మధ్యలో శర్వానంద్ పెళ్లి జరగడంతో.. ఈ మూవీ షూటింగ్ కి కొంచెం బ్రేక్ పడింది. మొన్నటి వరకు లండన్ లో ఈ మూవీ షూటింగ్ ని జరుపుకున్నారు చిత్ర యూనిట్.

Rahul Sipligunj : బిగ్‌బాస్ ‘రతిక’తో రిలేషన్ గురించి రాహుల్ సిప్లిగంజ్ పోస్టు..

ఇక కృతిశెట్టికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూనే.. టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్ గురించి కూడా కామెంట్స్ చేశారు. త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తామంటూ పేర్కొన్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. మలయాళ సంగీతం దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కాగా శర్వానంద్ గత ఏడాది ‘ఒకే ఒక జీవితం’ అనే టైం ట్రావెల్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు